సూడాన్ రాజధాని ఖ్వార్టమ్‌లోని ఓ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 130మంది తీవ్రంగా గాయపడ్డారు. టైల్స్ తయారుచేసే ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అగ్నికీలలు, పొగ ఎగసిపడ్డాయి.
గ్యాస్ ట్యాంకర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరించిన అధికారులు.. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమూ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భారీ పేలుడు ధాటికి పరిశ్రమలో నిలిపి ఉంచిన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇదీ చూడండి: రోడ్డుప్రమాదంలో కుటుంబమంతా..!