ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. పిటిషనర్ అఫిడవిట్‌ను ప్రధాన వ్యాజ్యానికి జత చేయాలని ధర్మాసనం చెప్పినట్టు..... పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఓ ఐపీఎస్ అధికారిని నియమించారని ఆరోపిస్తూ.. పిటిషనర్ దానికి సంబంధించిన వివరాలను అదనపు అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు. అయితే ఈ వివరాలను ప్రధాన వ్యాజ్యానికి జత చేయాలని కోర్టు సూచించినట్లు న్యాయవాది పేర్కొన్నారు. గురువారం విచారణలో కోర్టు... ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయలేదని వివరించారు.
ఇదీ చూడండి..