జగద్గిరిగుట్టలో గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం గల గూడ వరమ్మకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. డివిజన్లోని అన్ని బస్తీలలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆమె కోరారు. తన హయాంలో పేదలకు రాజీవ్ గృహకల్ప ఇండ్లు ఇప్పించానని, సబ్ స్టేషన్, వీధి లైట్లు తెచ్చానని గుర్తు చేశారు. ఇప్పటి పాలకులు రెండు పడక గదుల ఇళ్లను ఇస్తామని ఇంతవరకు కేటాయించలేదని తెలిపారు. తనను గెలిపిస్తే జగద్గిరిగుట్టలో ప్రధాన సమస్యగా ఉన్న బస్ స్టాండ్ నిర్మాణం చేపిస్తామన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు ఎవరికిచ్చిన్రు? : గూడ వరమ్మ
మహిళా శక్తికి తాను నిదర్శనమని, భర్త చాటు రాజకీయాలు ఏనాడూ చేయలేదని, ఇకపైనా చేయబోనని జగద్గిరిగుట్ట డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గూడ వరమ్మ అన్నారు. గతంలో కౌన్సిలర్‌గా అభివృద్ధి చేసిన అనుభవం ఉందని, గెలిపిస్తే డిపో మంజూరు కోసం పోరాటం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు వరమ్మ.