హైదరాబాద్ నగరాభివృద్ధిలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని, ఎక్కడి డ్రైనేజీ అక్కడే ఉందని, తార్నాక డివిజన్ వ్యాప్తంగా మురుగునీటి వ్యవస్థ లోపాలు ప్రజలకు ఇబ్బందిగా మారాయని కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి జీడి అనిత అమర్నాథ్ ఆరోపించారు. ఏ బస్తీకి పోయినా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని బస్తి వాసులు తమ గోడు వెళ్లిపోతున్నారని అన్నారు. వరదల మూలంగా నష్టపోయిన నిరుపేదలకు సర్కారు సాయం అందించలేక పోయిందని విమర్శించారు. మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే డివిజన్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. ఇంటింటికీ వెళ్ళిన సందర్భంగా ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారని, ఆత్మ బంధువుగా పలకరిస్తున్నారని అనిత అమర్నాథ్ సంతోషం వ్యక్తం చేశారు.
గెలిపిస్తే కష్టాలు తీరుస్తాం : తార్నాక కాంగ్రెస్ అభ్యర్థి అనిత - ghmc tarnaka division news
తార్నాక డివిజన్ అభివృద్ధిని తెరాస సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తార్నాక డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అనిత అమర్నాథ్ ఆరోపించారు. ప్రచారం సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు.