ETV Bharat / entertainment

బిగ్​బాస్​ కంటెస్టెంట్లకు "డబుల్​" ట్రబుల్ - ఆ ముగ్గురిలో ఇద్దరు అవుట్​!​ - బిగ్​బాస్​ ఎలిమినేషన్​

Bigg Boss 7 Telugu Voting Results: బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ఎలిమినేషన్స్ హాట్ టాపిక్​గా మారాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్​ ఉంటుందని నాగ్​ చెప్పడంతో.. హౌజ్ నుంచి వెళ్లిపోయే కంటెస్టెంట్స్ ఎవరా అని ప్రేక్షకులు జోరుగా చర్చించుకుంటున్నారు. మరి.. ఆ ఇద్దరు ఎవరో మీకు తెలుసా?

Bigg Boss 7 Telugu Voting Results
Bigg Boss 7 Telugu Voting Results
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 4:52 PM IST

Updated : Nov 24, 2023, 5:00 PM IST

Bigg Boss 7 Telugu 12th Week Elimination Details: బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. దీంతో.. కంటెస్టెంట్స్ అందరూ అదే టెన్షన్‌లో ఉన్నారు. గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ జరిగి.. ఆ పాస్ ఎవరి చేతికీ వెళ్లకపోవడంతో బిగ్ బాసే స్వయంగా ఎలిమినేషన్‌ను క్యాన్సెల్ చేశారని వీకెండ్​ ఎపిసోడ్​లో హోస్ట్ చెప్పారు. అంతే కాకుండా.. వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా చెప్పారు. దీంతో.. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్‌లో ఒకరు ఫిక్స్ అయినట్టేనని.. ఆ రెండో వ్యక్తి ఎవరా? అని డిస్కస్ చేసుకుంటున్నారు.

8 మంది నామినేట్​ : హౌజ్​లో మొత్తం 10 మంది ఉన్నారు. ఈ వారం జరిగిన నామినేషన్​ ప్రక్రియలో.. ప్రియాంక, శోభాశెట్టి మినహా మిగిలిన ఎనిమిది మంది నామినేట్​ అయ్యారు. శివాజీ, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, రతిక, అశ్విని నామినేషన్స్​లో ఉన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ స్టార్ట్​ అయ్యింది.

బిగ్​బాస్​ 7 గ్రాండ్​ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్​ - ఆ రోజే ఎండ్​ కార్డ్​!

ఓటింగ్​లో మార్పులు: ఎక్కువ ఓటింగ్‌ సంపాదించడం కోసం.. ప్రస్తుతం అమర్, శివాజీ, ప్రశాంత్‌ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గతంలో శివాజీ నామినేషన్స్​లోకి వచ్చిన ప్రతిసారీ.. ఓటింగ్​లో అతనే టాప్​లో​ ఉన్నాడు. కానీ ఈ వారం ఓటింగ్​లో అనూహ్యంగా అమర్​దీప్​ లీడ్​లోకి వచ్చాడు. ఆ తర్వాతి స్థానాల్లో పల్లవి ప్రశాంత్​, శివాజీ ఉన్నారు.​ వీరి తర్వాత స్థానాల్లో యావర్​, గౌతమ్​కృష్ణ ఉండగా.. ఓటింగ్స్‌లో చివరి స్థానంలో రతిక, అర్జున్, అశ్విని ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో వీక్‌గా ఉన్న కంటెస్టెంట్ అశ్వినినే కాబట్టి.. తను ఈవారం కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక తనతోపాటు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అని ఆలోచిస్తున్నారు.

గ్రాండ్​గా బిగ్​ బాస్ మానస్​ పెళ్లి వేడుక - హాజరైన ప్రముఖులు

డేంజర్ జోన్‌లో అర్జున్..! వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ద్వారా హౌజ్​లోకి వచ్చిన అంబటి అర్జున్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే.. ఓటింగ్ విషయంలో అర్జున్.. ఆఖరి మూడు స్థానాల్లో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో అశ్వినితోపాటు అర్జున్ కూడా హౌజ్ నుంచి వెళ్లిపోతాడా? అని ఆడియెన్స్ అనుమానిస్తున్నారు. ఒకవేళ అర్జున్ కాకపోతే రతిక హౌజ్‌ నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్​ లైన్స్​ ఓపెన్​లో ఉండటంతో.. రతిక లేదా అర్జున్​లో ఎవరు ఎలిమినేట్​ అవుతారో చూడాల్సి ఉంది.

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

చివరి కెప్టెన్​గా అమర్​దీప్!​: షో ముగింపు దశకు వచ్చే సరికి.. రసవత్తరంగా సాగుతోంది. 13వ వారానికి కెప్టెన్​గా అమర్ దీప్ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమర్​దీప్​కు కెప్టెన్​ అయ్యే అవకాశం రాలేదు. కెప్టెన్​ అవ్వడం కోసం.. ఇదే లాస్ట్​ వీక్​ అని నాగార్జున చెప్పడంతో.. ఈ వారం అమర్​ దీప్​కు అవకాశం వచ్చినట్లు లీక్స్ వచ్చాయి. మరి.. ఏం జరుగుతుందన్నది చూడాలి.

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

Bigg Boss Telugu 7 Wild Card Entries : బిగ్​బాస్​ వైల్డ్​ కార్డ్​.. ఎవరెవర్నో తెచ్చారు.. క్రేజ్ పెరిగేనా?

Bigg Boss Telugu Season 7 Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్​కు 26 ఎకరాలు, లగ్జరీ కార్లు, కోట్ల విలువ చేసే ఆస్తులు.. క్లారిటీ ఇచ్చిన అతని తండ్రి.!

Voice Behind Bigg Boss Season 7 Telugu: బిగ్​బాస్​ హౌస్​లో వినిపించే గొంతు ఎవరిదో కాదు.. ఇతనిదే..!

Last Updated : Nov 24, 2023, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.