ETV Bharat / entertainment

కేజీఎఫ్​ 2: 'ఆ సీన్స్​ను సహజంగా చేయడానికే ప్రాధాన్యం ఇచ్చా' - యశ్​ కేజీఎఫ్ 2 రవీనా టాండ్​న్​

KGF 2 Sanjaydutt: 'కేజీఎఫ్​ 2' క్లైమాక్స్‌ భారీ స్థాయిలో ఉంటుందని తెలిపారు సీనియర్​ నటుడు సంజయ్​ దత్​. అందులో నటించడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు. యాక్షన్​ సన్నివేశాల్లో సహజంగానే నటించేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

kgf 2 movie
కేజీఎఫ్​ 2 సినిమా
author img

By

Published : Apr 6, 2022, 7:22 AM IST

KGF 2 Sanjaydutt: 'కేజీఎఫ్‌-2'తో భయంకరమైన వ్యక్తి 'అధీరా'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంజయ్‌ దత్‌ ఆ సినిమా చిత్రీకరణకు సంబంధించి తన అనుభవాలను పంచుకున్నారు. తనకున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కారణంగా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ చిత్ర బృందం అందించిన సహకారంతో షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపారు. తన పాత్రను మొత్తం గ్రీన్‌ మ్యాట్‌పై షూట్‌ చేస్తానని దర్శకుడు ప్రతిపాదించినా సహజంగా చేయడానికే ప్రాధాన్యం ఇచ్చానని వివరించారు. "ఈ సినిమా క్లైమాక్స్‌ భారీ స్థాయిలో ఉంటుంది. పెద్ద మొత్తంలో బురద, దుమ్ము, నిప్పు ఉంటాయి. వీటి మధ్యలో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించడం కష్టంగా అనిపించింది. సహచరుల సహకారం లేకుండా ఇది అసాధ్యం" అని దత్‌ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించినట్లు సంజూ తెలిపారు.

కన్నడ రాకింగ్ స్టార్​ యశ్‌, సంజయ్‌ దత్‌, శ్రీనిధి, ప్రకాష్‌ రాజ్‌ ప్రధాన పాత్రధారులుగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కింది 'కేజీఎఫ్‌ 2' ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. రవి బసూర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు భువన్‌ గౌడ సినిమాటోగ్రాఫర్‌. 'కేజీఎఫ్‌-1' విజయంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇదీ చూడండి: 'వరుణ్​కు ఓపిక ఎక్కువ.. ఆ విషయంలో బాగా సహకరించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.