ETV Bharat / entertainment

'ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమంటే ఇదే!'.. 700 మందితో సెల్ఫీలు దిగిన యశ్‌ - హీరో యశ్ సెల్ఫీలు

క్రేజీ యంగ్‌ హీరో యశ్‌ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. తనను రియల్ హీరో అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

yash-clicks-selfies-with-seven-hundred-fans-in-bangalore

author img

By

Published : Dec 18, 2022, 11:19 AM IST

యశ్.. 'కేజీయఫ్‌' తర్వాత ఈ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సూపర్‌ హిట్‌ అందుకుని మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు ఈ హీరో. తాజాగా యశ్‌ చేసిన పనికి అభిమానులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో 'రియల్‌ సూపర్‌స్టార్‌' అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమంటే ఇదే..' అని ప్రశంసలు కురిపిస్తున్నారు. యశ్‌ అభిమానులతో దిగిన సెల్ఫీలే దీనికి కారణం.

ఇటీవల బెంగుళూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి యశ్‌ అతిథిగా హాజరయ్యారు. ఈ స్టార్‌ హీరోను చూసేందుకు అభిమానులు దూరప్రాంతాల నుంచి తరలివచ్చారు. యశ్‌తో ఫొటో దిగాలని వారంతా నిర్వాహకులను కోరగా.. గ్రూప్‌ ఫొటోకు మాత్రమే అనుమతి ఇస్తామని వారు చెప్పారు. కానీ, యశ్‌ వారితో మాట్లాడి అక్కడి వచ్చిన ప్రతి ఒక్కరితో విడిగా సెల్ఫీలు దిగారు. ఏకంగా 700 మంది అభిమానులు ఈ కేజీయఫ్‌ స్టార్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

యశ్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్లో రూపొందిన 'కేజీయఫ్‌' సిరీస్‌ చిత్రాలు సంచలన విజయాలు అందుకున్నాయి. యశ్‌ కెరీర్‌లోనే 'కేజీఎఫ్‌-2' అతి పెద్ద హిట్‌గా నిలిచింది. కానీ, రాకీభాయ్‌ ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే 'కేజీయఫ్‌-3' ఉంటుందని గతంలోనే చిత్రబృందం ఖరారు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.