ETV Bharat / entertainment

యశ్ బర్త్​డే.. కేజీఎఫ్-3పై హోంబలే అప్డేట్.. మాన్​స్టర్ హిట్ పక్కా! - కేజీఎఫ్ యశ్ పుట్టినరోజు

కేజీఎఫ్ సినిమాలకు మూడో సీక్వెల్ రాబోతోందా? యశ్ పుట్టినరోజు సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ చేసిన ట్వీట్​కు అర్థం అదేనా? అసలు ఆ ట్వీట్​లో ఏముందంటే?

KGF 3 MOVIE
KGF 3 MOVIE
author img

By

Published : Jan 8, 2023, 4:51 PM IST

కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్​గా ఎదిగారు హీరో యశ్. 2022లో విడుదలైన కేజీఎఫ్-2 వందల కోట్లు వసూలు చేసింది. ఎటువంటి బ్యాక్​ గ్రౌండ్​ లేకుండా బెంగళూరులోని ఓ చిన్న ప్రాంతం నుంచి వచ్చిన యశ్.. ఇప్పుడు అందరి ఫేవరెట్​గా మారిపోయారు. జనవరి 8న యశ్ పుట్టిన రోజు సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. యశ్​కు బర్త్​డే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన ఆ సంస్థ.. కేజీఎఫ్-3పై హింట్ ఇచ్చింది.

'కేజీఎఫ్ ఛాప్టర్ 2 భారీ హిట్ సొంతం చేసుకుంది. మరో మాన్​స్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాం. కలను సాకారం చేసిన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది. కాగా, ఈ ట్వీట్​లో ఉపయోగించిన 'మాన్​స్టర్ హిట్' అన్న పదం కేజీఎఫ్-3 గురించేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈసారి కేజీఎఫ్-3 వస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ మళ్లీ రాసుకోవాల్సిందేనని ట్వీట్లు పెడుతున్నారు. దీంతో కేజీఎఫ్-3 అనే హాష్​టాగ్ ట్విట్టర్​లో ట్రెండింగ్​గా మారింది.

KGF 3 MOVIE
.

2022లో హోంబలే ఫిల్మ్స్ రెండు భారీ విజయాల్ని సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో వచ్చిన కేజీఎఫ్-2 కనకవర్షాన్ని కురిపించింది. దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇకపోతే, ఇదే బ్యానర్ నుంచి వచ్చిన కాంతార సినిమాకు.. అనూహ్య స్పందన లభించింది. చిన్న సినిమాగా మొదలైన కాంతార.. క్రమంగా అన్ని ఇండస్ట్రీలలో టాక్ ఆఫ్​ది టౌన్​గా మారింది. దీంతో వివిధ భాషల్లో సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. దాదాపు అన్ని భాషల్లో ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.