ETV Bharat / entertainment

రీరిలీజ్​ ట్రెండ్​.. ఈ మార్చి నెలంతా మెగా హీరోలదే! - అల్లు అర్జున్​ బర్త్​డే స్పెషల్​

ప్రస్తుతం టాలీవుడ్​లో రీరిలీజ్​ల ట్రెండ్​ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మార్చి నెలంతా థియేటర్లలో మెగా హీరోలు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిలో చిరంజీవి, పవన్​ కల్యాణ్​, రామ్ చరణ్​, అల్లు అర్జున్​ చిత్రాలు ఉన్నాయి. ఆ వివరాలు..

gang leader re release
gang leader re release
author img

By

Published : Mar 3, 2023, 12:13 PM IST

టాలీవుడ్​ అంతటా ఇప్పుడు రీరిలీజ్​ల ట్రెండ్​ నడుస్తోంది. ఇప్పటికే అభిమానుల కోరిక మేరకు పలువురు స్టార్​ హీరోల సినిమాలు.. వారి పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మహేశ్​ బాబు 'పోకిరి'తో స్టార్ట్​ అయిన ఈ ట్రెండ్​ సక్సెస్​ఫుల్​గా కొనసాగుతోంది. ఆ తర్వాత వచ్చిన 'ఒక్కడు', 'ఖుషి', 'జల్సా' సినిమాలకు సైతం సిల్వర్​స్క్రీన్​పై మంచి రెస్పాన్స్​ వచ్చింది. అయితే ఇప్పుడు మరిన్ని సినిమాలు త్వరలో రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

కానీ ఈ నెలలో రీరిలీజ్​ల సినిమాల విషయంలో ఓ స్పెషల్​ ఉంది. అదేంటంటే.. ఈ నెల మొత్తం మెగా హీరోల ట్రెండ్​ నడిచేలా ఉంది. మార్చి 4న మెగాస్టార్​ చిరంజీవి 'గ్యాంగ్​ లీడర్'​ రిలీజయ్యేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ​ 'గ్యాంగ్​ లీడర్'​ 32 ఏళ్ల క్రితం సినిమా కావడం వల్ల దీన్ని 4కేకు మార్చడానికి మేకర్స్​కు బాగా ఖర్చు అయ్యినట్లు సమాచారం. అంతే కాకుండా ఇదే నెలలో మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ సినిమా కూడా రిలీజయ్యేందకు రెడీగా ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్​ బస్టర్​ మూవీ 'మగధీర' కూడా చరణ్​ బర్త్​డే (మార్చి 27) సందర్భంగా రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది.

అలా తండ్రీ కొడుకుల హవా నడిచే వేళ మెగా ఇంటి బంధువైన అల్లు కుటుబం కూడా.. తమ వారసుడి సినిమాను రీ రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్​ కమర్షియల్​ ఎంటర్టైనర్​ 'దేశముదురు' కూడా మార్చిలో రీరిలీజయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక వేళ మార్చిలో రిలీజవ్వకపోతే ఈ సినిమాను ఏప్రిల్​ 8 బన్నీ బర్త్​డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. కానీ ఫ్యాన్స్​ మాత్రం మార్చిలోనే ఈ చిత్రాన్ని రీరిలీజ్​ చేస్తే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు. మార్చి నెలలో మెగాహీరోల సందడి అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

ఇంత మంది వచ్చాక ఇక పవర్​ స్టార్​ రాకపోతే ఈ ట్రెండ్​కు కిక్​ ఏం ఉంటుంది. అందుకే పవన్​ కల్యాణ్​ 'గబ్బర్​ సింగ్'​ సినిమా కూడా ఈ నెలలోనే రిలీజ్​ కానుందట. దీనికి సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్​ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ కూడా మార్చి 24న థియేటర్​లో సందడి చేయనుంది. అలా మొత్తానికి ఈ మార్చి నెలంతా థియేటర్లలో మెగా హీరోలు సండడి చేయనున్నారనమాట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.