ETV Bharat / entertainment

Das Ka Dhamki Review: విశ్వక్​ సేన్​ 'దమ్కీ' ఆకట్టుకున్నట్టేనా?

author img

By

Published : Mar 22, 2023, 3:41 PM IST

Updated : Mar 22, 2023, 3:52 PM IST

సెల్ఫ్​ మేడ్​ స్టార్​ విశ్వక్​ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాస్‌ కా దమ్కీ' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇందులో ఆయన డబుల్ రోల్​ చేయడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం. మరి ఇంతకీ ఆయన సక్సెస్​ అయినట్టేనా?

Das ka Dhamik movie review
విశ్వక్​ సేన్​ 'దమ్కీ' రివ్యూ

​అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో గతేడాది బాక్సాఫీస్‌ ముందు అలరించిన యాటిట్యూడ్​ స్టార్ విశ్వక్​ సేన్.. ఈ ఉగాదికి 'దాస్‌ కా దమ్కీమ్కీ'తో పాన్‌ ఇండియా లెవల్​లో ఆడియెన్స్​ ముందుకు వచ్చారు. ఇందులో ఆయన డబుల్ రోల్​ చేయడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం. అందుకే ఈ చిత్రంపై రిలీజ్​కు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటం.. ప్రీరిలీజ్‌ వేడుకకు జూనియర్​ ఎన్టీఆర్‌ చీఫ్ గెస్ట్ గా రావడంతో సినిమాపై మరింత ఆసక్తి ఎక్కువైంది. మరి ఈ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన మన దాస్‌.. ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడా.. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్​ అయ్యాడా తెలుసుకుందాం..

ఎవరెలా చేశారంటే.. కృష్ణదాస్, సంజయ్‌ రుద్ర పాత్రల మధ్య డిఫరెన్స్​ను విశ్వక్‌సేన్‌ బాగా చక్కగా చూపించారు. ముఖ్యంగా నెగటివ్​ షేడ్స్​ ఉన్న సంజయ్‌ పాత్రలో విశ్వక్​ సేన్​ యాక్టింగ్​ ఆకట్టుకుంది. అయితే ఆ రోల్​ను సెకండాఫ్​లో కొంత సమయం వరకూ మాత్రమే పరిమితం చేశారు. కీర్తి పాత్రలో నివేదా అందంగా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఆమె పాత్రకు అంతగా స్కోప్​ లేదు. రావు రమేష్‌ది సాదాసీదా పాత్ర. పెద్దగా ఏమీ లేదు. హైపర్‌ ఆది, మహేశ్​ తన మార్క కామెడీతో కనిపించినంత సేపూ నవ్వించారు. ముఖ్యంగా 'హ్యాపీడేస్‌'లోని టైసన్‌ పాత్ర తరహాలో మహేశ్​ చెప్పిన డైలాగ్‌లు, తరుణ్‌ భాస్కర్‌తో ఆయన ఆడుకునే ఎపిసోడ్‌ బాగా నవ్వు తెప్పించింది. దర్శకుడిగా విశ్వక్​ పర్వాలేదనిపించినా, కథలోనే అంత బలం లేదని చెప్పాలి. ఫస్టాఫ్​ కాలక్షేపాన్నిచ్చినా.. సెకండాఫ్​ సహనానికి పరీక్ష అనే చెప్పాలి. క్లైమాక్స్​ ముందొచ్చే ట్విస్ట్‌లు కొన్ని ఆకట్టుకోగా.. మరికొన్ని కన్ఫూజన్​ చేస్తాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. 'మావా బ్రో', 'పడిపోయిందే పిల్లా' పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​ కూడా ఆకట్టుకుంది. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగానే ఉన్నాయి.

బలాలు: విష్వక్‌ అద్భుతంగా నటించారు. విరామ సన్నివేశాలు బాగున్నాయి. పాటలు, కొన్ని కామెడీ ట్రాక్స్‌ కూడా బాగా ఆకట్టుకున్నాయి.

బలహీనతలు: కథలో కొత్తదనం లేదు. ద్వితీయార్ధం కూడా అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.

చివరిగా: దాస్‌ అభిమానులు, మాస్‌ ప్రేక్షకులకే ఈ ధమ్కీ సినిమా అని చెప్పాలి. అయితే ఈ రివ్యూ సమీక్షకుడి దృష్టి కోణంలో రాసినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 47 ఏళ్ల వయసులో తల్లి డెలివరీ.. బుల్లి చెల్లి పుట్టిందంటూ 23 ఏళ్ల నటి ఫుల్​ హ్యాపీ!

Last Updated : Mar 22, 2023, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.