Vikram movie actors remeuneration: యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం 'విక్రమ్'. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, హీరో సూర్య కూడా ఈ సినిమాలో నటిస్తుండటమే అందుకు కారణం. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న విడుదలై సూపర్‌హిట్ టాక్‌ను అందుకుంది. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఒకేసారి ఇంతమంది స్టార్లు ఈ చిత్రంలో నటించడం వల్ల వీళ్ల రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు రూ.120కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. కమల్‌హాసన్ అత్యధికంగా రూ.50కోట్లు పారితోషికం తీసుకోగా.. దర్శకుడు లోకేష్ రూ.8కోట్లు తీసుకున్నారని వినికిడి. ఇక విజయ్ సేతుపతి రూ.10కోట్లు, ఫహద్ రూ.4కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూ.4కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. హీరో సూర్య పారితోషికంపై స్పష్టత లేదు. ఇక ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్. దాదాపు రూ.200 కోట్లకు డీల్ ముగిసిందట.
ఇదీ చూడండి: 'మేజర్' టీమ్ కీలక ప్రకటన.. ఆర్మీలో చేరాలనుకునేవారికి సాయం