Vijayakanth Passed Away Today : ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్(71) కన్నుమూశారు. తమిళనాడులోని చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విజయ్‌కాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్‌కాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు.
ఆ సమయంలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి బాగా సహకరిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. చికిత్స అనంతరం ఈనెల 11న విజయ్ కాంత్‌ను డిశ్చార్జి చేశారు. ఇటీవలే డీఎండీకే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా విజయ్‌కాంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రిలో చేరారు. కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం గురువారం ఉదయం ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఆయన మరణించినట్లు ప్రకటించింది.
-
Official medical bulletin from Chennai MIOT hospital announcing the passing away of Captain #Vijayakanth #RIPCaptain pic.twitter.com/yLynSrBj9I
— Ramesh Bala (@rameshlaus) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Official medical bulletin from Chennai MIOT hospital announcing the passing away of Captain #Vijayakanth #RIPCaptain pic.twitter.com/yLynSrBj9I
— Ramesh Bala (@rameshlaus) December 28, 2023Official medical bulletin from Chennai MIOT hospital announcing the passing away of Captain #Vijayakanth #RIPCaptain pic.twitter.com/yLynSrBj9I
— Ramesh Bala (@rameshlaus) December 28, 2023
విజయకాంత్ 1952 ఆగస్టు 25న మధురై (తమిళనాడు)లో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనిక్కుమ్ ఇలమై(1979). ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు.
Vijayakanth Movies List : సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్నో ఏళ్లపాటు సినీ అభిమానులను అలరించారు. దాదాపు 20కు పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా ఆ తర్వాత విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. మరోవైపు విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.