ETV Bharat / entertainment

Vijay Thalapathy Son : డైరెక్టర్​గా ఎంట్రీ ఇవ్వనున్న హీరో విజయ్ కుమారుడు.. ఆ బ్యానర్​లోనే ఫస్ట్ మూవీ - విజయ్ లియో అప్డేట్

Vijay Thalapathy Son : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు సంజయ్.. డైరెక్టర్​గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. సోమవారం అధికారికంగా వెల్లడించింది.

Vijay Thalapathy Son
Vijay Thalapathy Son
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 6:31 PM IST

Updated : Aug 28, 2023, 9:32 PM IST

Vijay Thalapathy Son : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్.. సినిమా డైరెక్టర్​ కానున్నాడంటూ కొద్దికాలంగా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు నేటితో తెరపడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' బ్యానర్​లో సంజయ్ (Jason Sanjay Debut).. ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్.. ట్విట్టర్​లో అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సుభాస్కరన్​ రూపొందించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంజయ్​కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

"నా స్ర్కిప్ట్​ నచ్చి డైరెక్టర్​గా నాకు ఛాన్స్​ ఇచ్చిన నిర్మాత సుభాస్కరన్ సర్​కు థ్యాంక్స్​. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి" అని సంజయ్ తెలిపారు. సంజయ్ చెన్నైలో ఇంటర్ విద్య పూర్తి చేసి.. తర్వాత ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లారు. ఫారిన్​లోనే ఫిల్మ్​ మేకింగ్ కోర్సు చేశాడట. అయితే తెలుగు సెన్సేషన్ హిట్ 'ఉప్పెన' సినిమా, తమిళ్​ రీమేక్​తో కోలీవుడ్​లో సంజయ్ హీరోగా పరిచయం కానున్నారని గతంలో ప్రచారం సాగింది.

Vijay Thalapathy Leo : ఇకపోతే విజయ్ ప్రస్తుతం విక్రమ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌తో 'లియో' మూవీ చేస్తున్నారు. దర్శకుడు లోకేశ్‌. ఈ సినిమాను పవర్​ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్​గా తెరకెక్కిస్తున్నారు. ఇక రీసెంట్​గా ఈ సినిమా నుంచి .. యాక్షన్ కింగ్ అర్జున్ (Leo Movie Arjun Sarja)కు సంబంధించిన 'హరోల్డ్​​ దాస్' అనే పేరుతో గ్లింప్స్​ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ గ్లింప్స్​ ​విక్రమ్ సినిమాను గుర్తు చేస్తున్నాయని సినీప్రియులు అంటున్నారు.

ముఖ్యంగా హరోల్డ్​​ దాస్ గ్లింప్స్.. విక్రమ్​ మూవీలోని రోలెక్స్ క్యారెక్టర్​ తరహాల ఉందని, క్యారెక్టరైజేషన్​ అచ్చం అలానే కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. అర్జున్ సర్జాతో పాటు గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, సాండీ మాస్టర్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Leo Movie Arjun Sarja : 'లియో'లో హరోల్డ్ దాస్​గా యాక్షన్​ కింగ్ అర్జున్​.. వీడియో మరీ ఇంత వైల్డ్​గానా?

విజయ్​-వెంకట్‌ ప్రభు కాంబో అఫీషియల్​.. రూ.200కోట్ల రెమ్యునరేషన్​.. నిజమెంత?

Last Updated : Aug 28, 2023, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.