Vijaydevarkonda Auto rickshaw టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలకు దగ్గరవుతోంది. ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచింది మూవీటీమ్. హీరో హీరోయిన్లు విజయ్, అనన్య పాండే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలను చుట్టేస్తూ తమ సినిమాను వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడి స్థానికులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారితో కలిసి సందడి చేస్తున్నారు.
అయితే ఇటీవలే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చెప్పులు ధరించి ట్రెండ్ సెట్ చేసిన రౌడీ బాయ్.. ఆతర్వాత ఓ ప్రమోషన్ ఈవెంట్ కోసం హీరోయిన్ అనన్యతో కలిసి ఫ్లైట్‌లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు. ఆ తర్వాత ప్రమోషన్‌లో భాగంగానే ముంబయిలో నిర్వహించిన ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు ఆటో రిక్షాలో వచ్చాడు. లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ జోరున వర్షంలోనే ఆటోలో గమ్య స్థానానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో తెల్లటి దుస్తులు ధరించిన విజయ్ హ్యాండ్స్‌మ్‌గా కనిపించాడు. ఇలా తన సింప్లిసిటీతో అభిమానుల మనసు గెల్చుకున్న విజయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
నడుం నొప్పితో ఇబ్బందిపడుతోన్న విజయ్.. 'లైగర్' ప్రమోషన్స్ కోసం ఎంతో శ్రమిస్తున్న విజయ్ తమ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వరుస ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. దీనివల్ల ఆయన తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతోన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తూ విజయ్ నడుం నొప్పి ఇబ్బందిపడుతోన్న ఓ వీడియోని అభిమాని షేర్ చేశాడు. "తీవ్రమైన నడుంనొప్పితో విజయ్ ఇబ్బందిపడుతోన్నట్లు ఈ వీడియో స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఆయన ఫ్యాన్స్ మీట్ పెట్టి ఎంతోమందితో ఫొటోలు దిగారు. ఆయన అభిమానిగా ఉన్నందుకు గర్విస్తున్నా" అని పేర్కొన్నాడు. దానిపై ఛార్మి స్పందిస్తూ.. "అవును నిజమే. మీరు బాగా గుర్తించారు. దెబ్బల్ని, నొప్పిని సైతం లెక్కచేయకుండా 'లైగర్' ప్రమోషన్స్ కోసం విజయ్ రేయింబవళ్లూ వరుసగా ప్రయాణాలు చేస్తున్నాడు" అని చెప్పుకొచ్చారు.
-
Back pain severe ga undi ani e video chuste ardam avtundi anna..
— Preetam Kumar (@preetamrowdy17) August 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Ayyina kuda fans meet petti anta mandiki photos ichinav. We can feel your love on us.
Fan for life ani proud ga cheptunna ..🙏🙏#VijayDeverakonda#Liger#LigerFansMeet pic.twitter.com/MQZRvKTAma
">Back pain severe ga undi ani e video chuste ardam avtundi anna..
— Preetam Kumar (@preetamrowdy17) August 17, 2022
Ayyina kuda fans meet petti anta mandiki photos ichinav. We can feel your love on us.
Fan for life ani proud ga cheptunna ..🙏🙏#VijayDeverakonda#Liger#LigerFansMeet pic.twitter.com/MQZRvKTAmaBack pain severe ga undi ani e video chuste ardam avtundi anna..
— Preetam Kumar (@preetamrowdy17) August 17, 2022
Ayyina kuda fans meet petti anta mandiki photos ichinav. We can feel your love on us.
Fan for life ani proud ga cheptunna ..🙏🙏#VijayDeverakonda#Liger#LigerFansMeet pic.twitter.com/MQZRvKTAma
ప్రత్యేక పూజలు.. మరోవైపు తన కుమారుడు విజయ్ దేవరకొండ, నటి అనన్యా పాండే కోసం.. హీరో తల్లి మాధవి ప్రత్యేక పూజలు చేశారు. విజయ్ నివాసంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో విజయ్, అనన్య పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో వీరిద్దరికీ మాధవి రక్ష కట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. "ఆ దేవుడి ఆశీస్సులతోనే ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మీ ప్రేమాభిమానాన్ని పొందుతున్నానని అనుకుంటున్నా!! అయినా, ఆ దేవుడి రక్షణ మాకు ఎప్పటికీ ఉండాలని అమ్మ భావించింది..! అందుకే పూజ చేయించి, మా అందరికీ రక్ష కట్టింది. ఇక, ఆమె ప్రశాంతంగా నిద్రిస్తుంది. మేమూ మా టూర్‌ని కొనసాగించవచ్చు"అని విజయ్ రాసుకొచ్చారు.
కాగా పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమాలో ఎంఎంఏ ఫైటర్‌గా కనిపించనున్నాడు విజయ్. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో పాటు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఇదీ చూడండి: రాకెట్రీ కోసం మాధవన్ ఇల్లు అమ్ముకున్నారా, ఇదిగో ప్రూఫ్