ETV Bharat / entertainment

మాల్దీవులు టూర్​కు విజయ్​-రష్మిక!.. ప్రేమలో మునిగితేలుతున్నారా? - విజయ్​ దేవరకొండ వార్తలు

ఆన్‌స్క్రీన్‌ లవ్లీ జోడీ విజయ్‌ దేవరకొండ - రష్మిక మరోసారి వార్తల్లో నిలిచారు. వరుస సినిమా షూట్స్‌తో బిజీగా ఉంటోన్న వీరిద్దరూ వర్క్‌ లైఫ్‌ నుంచి విరామం తీసుకుని విదేశాలకు టూర్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు మరోసారి వార్తలు గుప్పుమన్నాయి.

Vijay Devarakonda Rashmika Maldives Tour

author img

By

Published : Oct 7, 2022, 1:51 PM IST

Vijay Devarakonda Rashmika Maldives Tour: 'గీతగోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌'తో ఆన్‌స్క్రీన్‌ లవ్లీ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్‌ జంట విజయ్‌ దేవరకొండ, రష్మిక. వరుస సినిమా షూటింగ్స్‌తో కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ జోడీ వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ విదేశాలకు పయనమైన పలు వీడియోలు ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఎయిర్​పోర్ట్​లో విజయ్​, రష్మిక

'లైగర్‌' పరాజయం తర్వాత విజయ్‌ దేవరకొండ తన తదుపరి చిత్రం 'ఖుషి'పై దృష్టి సారించారు. ఈ సినిమాతో అభిమానులను అలరించడం కోసం ఆయన శ్రమిస్తున్నారు. మరోవైపు, 'పుష్ప'తో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సొంతం చేసుకున్న రష్మిక బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. అమితాబ్‌తో కలిసి ఆమె కీలకపాత్రలో నటించిన 'గుడ్‌బై' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ అందుకుంది.

దీంతో విజయ్‌ - రష్మిక వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ దర్శనమిచ్చారు. తొలుత ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రష్మిక.. ఫొటోగ్రాఫర్లకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్ది సమయానికే విజయ్‌ సైతం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విజయ్‌-రష్మిక కలిసి మాల్దీవులకు టూర్‌ వెళ్తున్నారంటూ పలు వెబ్‌సైట్లలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో విజయ్‌-రష్మిక ప్రేమలో ఉన్నారనే వార్తలు మరోసారి గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి: 'గాడ్​ఫాదర్​' డైరెక్టర్​తో నాగార్జున-అఖిల్​ మూవీ!.. స్క్రిప్ట్​ వర్క్​ షురూ!!

'గాడ్​ఫాదర్​'లో చిరు తండ్రిని మీరు గుర్తుపట్టారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.