తన మార్క్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్ ఆంటోని. 2016 తమిళంలో 'పిచ్చైక్కరన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇదే చిత్రం తెలుగులో 'బిచ్చగాడు' టైటిల్‌తో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. విజయ్ నటనతో పాటు ముఖ్యంగా సినిమా కథకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడీ మూవీకి సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2' వస్తోంది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 19న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
సిస్టర్ సెంటిమెంటా?.. 'విజయ్ గురుమూర్తి. దేశంలోనే 7వ రిచెస్ట్ పర్సన్. లక్ష కోట్లకు వారసుడు' అంటూ దేవ్ గిల్ చెప్పే సంభాషణలతో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో.. విజయ్ ఆంటోని ఓ వైపు స్టైలిష్ లుక్‌లో రిచెస్ట్ మ్యాన్‌గా మరోవైపు ఇంకో గెటప్‌లో సీరియస్ యాక్షన్ సీన్స్‌లో కనిపించారు. ఆ తర్వాత విజయ్ గురుమూర్తి హత్యకు గురైనట్లు, ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతున్నట్లు చూపించారు. ఈ కేసులో సత్య(విజయ్ ఆంటోనీ మరో పాత్ర) అనే వ్యక్తిని హంతకుడిగా చిత్రీకరిస్తూ కోర్టులో కేసు నడవగా.. ఇదో భిన్నమైన కేసు అని న్యాయవాదులు చెప్పడం.. మరోవైపు సత్య కోర్టుకు రాగానే యాంటీ బికిలీ అంటూ జనాలు నినాదాలు చేయడం చూపించారు. అదే సమయంలో ఓ వ్యక్తిని చంపి ఎడారిలో పారేసినట్లు కనిపించింది. ఆ తర్వాత ఓ చిన్న బాబు తన చెల్లితో కలిసి రోడ్డు మీద అడుక్కోవడం.. అదే సమయంలో ఆ బాబుని పోలీసులు అరెస్టు చేయడం.. చెల్లిని ఇంకెవరో తరమడం చూపించారు. అనంతరం ఆ బాలుడు వయసు పెరిగాక సంచిలో కత్తులు పెట్టుకుని వెళ్తూ ఎవరినో చంపినట్లు ట్రైలర్‌ను ముగించారు. విజయ్ గురుమూర్తిని.. సత్య ఎందుకు చంపాడు? వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ ఆ పిల్లాడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథను ఎక్కడ రివీల్ చేయలేదు. చిన్నపిల్లల సన్నివేశం చూస్తుంటే సిస్టర్ సెంటిమెంట్ కూడా సినిమాలో ఉన్నట్లు అర్థమవుతోంది.
మైడికల్ సైన్స్ నేపథ్యంలో.. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుంచి 'స్నీక్ పీక్ ట్రైలర్'ను రిలీజ్ చేశారు. ఇందులో ఈ మూవీ కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు. రక్తం, శరీరంలోని ఇతర అవయవాలను మార్చినట్లు.. మెదడును కూడా ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందనే అంశాన్ని ఇందులో చూపించారు. మహాత్మా గాంధీ, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఐజక్ న్యూటన్ వంటి మేధావుల మెదడలను ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ఎంతో మేలు జరుగుతుందని ఓ శాస్త్రవేత్త చెప్పగా.. ఇంకో వ్యక్తి హిట్లర్ లాంటి చెడ్డవారి మెడదును ట్రాన్స్ ప్లాంట్ ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్తారు. ఈ మొత్తాన్ని దేవ్ గిల్ ఇంట్లో కూర్చుని చూస్తూ ఉంటారు. అలా ఈ స్నీక్ ప్రీక్ ట్రైలర్‌ను ముగించారు.
డూప్ లేకుండా.. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌లో డూప్ లేకుండా స్వయంగా విజయ్ ఆంటోనినే నటించారని తెలిసింది. గతంలో మలేషియాలో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఓ యాక్షన్ సన్నివేశంలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితమే కోలుకున్నారు. ఇక ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో మే 19న రిలీజ్ చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'థియేటర్లలో ఆడియెన్స్ అరుపులు మామూలుగా లేవు!'.. 'ఏజెంట్' ట్రోల్స్‌పై అమల రియాక్షన్ ఇదే!!