ETV Bharat / entertainment

'స్కామ్ 1992' నటుడు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం - మిథిలేశ్​ చక్రవర్తి సినిమాలు

Mithilesh Chaturvedi Died: గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటుడు మిథిలేశ్​ చతుర్వేది కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Etv Bharatmithilesh chaturvedi passed away

author img

By

Published : Aug 4, 2022, 11:53 AM IST

Updated : Aug 4, 2022, 12:35 PM IST

Mithilesh Chaturvedi Died: చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఫేమస్​ వెబ్ సిరీస్​ 'స్కామ్​ 1992'లో నటించిన ప్రముఖ నటుడు మిథిలేశ్​ చతుర్వేది కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. మిథిలేశ్​ మరణ వార్తను నిర్మాత హన్సల్​ మెహతా.. గురువారం ఉదయం సోషల్​మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మిథిలేశ్​ చతుర్వేది కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

మిథిలేశ్​ చతుర్వది
మిథిలేశ్​ చతుర్వది

మిథిలేశ్​ చ‌తుర్వేది రెండు ద‌శాబ్దాల‌కు పైగా సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నారు. 1997లో వ‌చ్చిన 'భాయ్ భాయ్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మిథిలేశ్​.. అన‌తి కాలంలోనే అగ్ర క‌థానాయ‌కుల సినిమాల్లో న‌టించి ఇండ‌స్ట్రీలో గొప్ప న‌టుడిగా ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకున్నారు. 'కోయి మిల్ గ‌యా', 'ఏక్ ప్రేమ్ క‌థ‌', 'స‌త్య‌', 'బంటీ ఔర్ బ‌బ్లీ', 'క్రిష్', 'తాల్‌', 'రెడీ' వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'క‌యామ‌త్‌', 'సింధూర్ తేరే నామ్ కా', 'నీలి ఛ‌త్రి వాలే' వంటి సిరీస్‌ల‌తో బుల్ల‌ితెర ప్రేక్ష‌కుల‌ను అలరించారు. ఈయ‌న చివ‌ర‌గా 'గులాబో సితాబో' సినిమాలో కనిపించారు. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన 'స్కామ్ 1992' వెబ్​సిరీస్​లో.. న్యాయవాది రామ్ జెఠ్మలానీ పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

Last Updated : Aug 4, 2022, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.