ETV Bharat / entertainment

పర్ఫెక్ట్​ పిక్చర్​ - వరుణ్​, లావణ్యతో కలిసి సింగిల్​ ఫ్రేమ్​లో మెగా హీరోస్ - mega heroes in one frame

Varun tej Lavanya tirpathi wedding Photos Mega Heroes : మెగాస్టార్ చిరంజీవి.. కొత్త దంపతులు వరుణ్​ - లావణ్యకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్​ మీడియాలో ఓ మెగా ఫొటోను పోస్ట్ చేశారు. సింగిల్ ఫ్రేమ్​లో మెగా హీరోస్​ అంతా కలిసి ఉండటం.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఫర్పెక్ట్ పిక్చర్​.. వరుణ్​ - లావణ్యతో కలిసి సింగిల్​ ఫ్రేమ్​లో మెగా హీరోస్..

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 9:34 AM IST

Updated : Nov 2, 2023, 11:00 AM IST

Varun tej Lavanya tirpathi wedding Photos Mega Heroes : మెగా ప్రిన్స్​ హీరో వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తంతు ముగిసింది. వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్​ 1వ తేదీన రాత్రి ఇటలీలోని టస్కనీలో గ్రాండ్​గా వీరి వివాహం జరిగింది. దీంతో కొత్త దంపతులకు మెగా అభిమానులంతా శుభాకాంక్షలు చెబుతూ సోషల్​ మీడియాలో పోస్ట్​లు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా వరుణ్‌- లావణ్యలకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో చిరంజీవితో పాటు పవన్‌ కల్యాణ్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయితేజ్​, పంజా వైష్ణవ్​ తేజ్​, అల్లు శిరీష్​ నిలబడి ఉండగా.. వారి ముందు వరుణ్ లావణ్య పెళ్లి డ్రెస్​లో కింద కూర్చొని పోజు ఇచ్చారు. అయితే వీరిలో పవన్ కల్యాణ్ - రామ్​ చరణ్ మినహా మిగతా హీరోలు షేర్వానీ డ్రెస్​లో సందడి చేశారు. పవన్ క్యాజువల్ టీషర్ట్​ క్రీమ్ కలర్​ ప్యాంట్​ ధరించగా.. చరణ్​ సింపుల్​గా డిజైన్డ్​ షర్ట్​- ప్యాంట్ ధరించి కనిపించారు. మొత్తంగా​ అభిమానుల కోసం మెగాస్టార్‌ షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. భారీగా లైక్స్ వస్తున్నాయి.

ఇకపోతే ఈ వివాహ వేడుకకు వరుణ్​ - లావణ్యకు చెందిన ఇరు కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారు. వేడుకలో మెగా- అల్లు కుటుంబాలు ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. ​అలాగే పెళ్లికి ముందు జరిగిన కాక్‌టైల్‌, మెహందీ, హ‌ల్దీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇక ఈ మెగా హీరోల సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి వశిష్ఠతో ఓ సినిమా.. పవన్ కల్యాణ్​ ఉస్తాద్​ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ.. రామ్​చరణ్​ 'గేమ్​ ఛేంజర్'​, అల్లు అర్జున్ 'పుష్ప 2', సాయి తేజ్ 'గాంజ శంకర్', వైష్ణవ్​ తేజ్​ 'ఆదికేశవ' చిత్రాల్లో నటిస్తున్నారు. ​

వరుణ్ తేజ్ - లావణ్యకు పవన్​ కల్యాణ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?.. ఇప్పుడు ఈ ఫొటోలే ఫుల్ ట్రెండింగ్​!

మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్ - లావణ్య త్రిపాఠి

Last Updated : Nov 2, 2023, 11:00 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.