ETV Bharat / entertainment

'వారిసు' రిలీజ్ వివాదం.. ​టాలీవుడ్​ నిర్మాతల మండలి కీలక వ్యాఖ్య - వారిసు సినిమా రిలీజ్​ వివాదం

సంక్రాంతి రిలీజ్​ సినిమాల విషషంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్నపై కోలీవుడ్​ నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై టీఎఫ్‌పీసీ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ స్పందించారు. ఏమన్నారంటే?

Varisu movie telugu film producer council
'వారిసు' రిలీజ్ వివాదం.. ​టాలీవుడ్​ నిర్మాతల మండలి కీలక కామెంట్​
author img

By

Published : Nov 21, 2022, 3:23 PM IST

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న ఓ నిర్ణయంపై కోలీవుడ్‌ నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా టీఎఫ్‌పీసీ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ స్పందించారు. "2023 సంక్రాంతి రిలీజ్‌ల విషయంలో తొలి ప్రాధాన్యం తెలుగు చిత్రాలకేనని పేర్కొంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇవ్వాలని.. మిగిలిన థియేటర్స్‌ను డబ్బింగ్‌ చిత్రాలకు కేటాయించాలని అందులోని సారాంశం. అంతేకానీ డబ్బింగ్‌ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్‌ చేస్తామని, లేదా ఇక్కడ ఆడనివ్వమని ఆ ప్రకటనలో ఎక్కడా చెప్పలేదు. ప్రెస్‌నోట్‌ విడుదల చేసిన చాలా రోజుల తర్వాత.. ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేసేలా పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ చిత్రాలను విడుదల చేయకపోతే.. తెలుగు చిత్రాలను అక్కడ విడుదల కానివ్వమనడం అర్థరహితం. సినిమా అనేది అందరికీ సంబంధించింది. కాబట్టి అందరూ 'లివ్​ అండ్​ లెట్​ లివ్​' అనే విషయాన్ని గ్రహించాలి" అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, టీఎఫ్‌పీసీ ప్రకటనతో వారిసు తెలుగు రిలీజ్‌పై వివాదం నెలకొంది. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్‌ చేయకపోతే.. 'వారిసు'కు ముందు.. తర్వాత అనేలా సినిమా ఇండస్ట్రీ మారనుందని దర్శకుడు లింగుస్వామి వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి: 'శంకరాభరణం'కు మరో అరుదైన గౌరవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.