ETV Bharat / entertainment

Upcoming Patriotic Movies : క్విట్​ ఇండియా యువతి గాథ.. ఓ సైనికుడి సీక్రెట్‌ ఆపరేషన్‌.. తెరపైకి రానున్న దేశ భక్తి సినిమాలు ఇవే.. - Maidaan Movie Hindi

Upcoming Patriotic Movies : సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో దేశ భక్తి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. 'మదర్ ఇండియా', 'లగాన్'​, 'షేర్షా', 'మేజర్'​ లాంటి సినిమాలకు ఆడియెన్స్​ ఎంతగానో కనెక్టయ్యారు. ఈ క్రమంలో త్వరలో మరిన్ని దేశభక్తి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అవేంటంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 15, 2023, 7:22 AM IST

Upcoming Patriotic Movies : దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎంతో మంది యోధులు తమ ప్రాణాలను అర్పించుకున్నారు. శత్రువులకు ఎదురెళ్లి యుద్ధం చేయాలన్నా.. జనంలో చైతన్యం నింపాలన్నా వారికి వారే సాటి. అలా దేశం కోసం సంగ్రామంలో ఉరికొయ్యల్ని ముద్దాడిన వీరుల త్యాగాన్ని ప్రజలు ఎన్నటికీ మరువరు. అయితే ఇలాంటి అమరవీరుల జీవితాలకు చిత్ర పరిశ్రమ ఎప్పటినుంచో బ్రహ్మరథం పడుతూనే ఉంది. వారి చరిత్రలను తెరపై చూపిస్తూ.. ప్రేక్షకుల్లో స్పూర్తిని నింపుతోంది. దేశభక్తే కథాంశంగా, మువ్వన్నెల పతాకమే మూలకథగా వచ్చిన చిత్రాలకు జనం నీరాజనం పడుతూనే ఉన్నారు.

దేశభక్తి కథలకు ప్రేక్షకుల హృదయాలను కదిలించే సత్తా ఉండటం వల్ల ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించే మార్గమయ్యాయి. దీంతో దర్శక నిర్మాతలు సైతం ఈ తరహా సినిమాలు రూపొందించడానికి ఉత్సాహ పడుతున్నారు. ఆయా సినిమాల్లో నటించేందుకు నటీనటులు కూడా ముందుకొస్తున్నారు. అలా అప్పటి మదర్​ ఇండియా నుంచి ఇప్పటి మేజర్​ దాక అటు బాలీవుడ్​తో పాటు ఇటు టాలీవుడ్​లోనూ ఎన్నో సినిమాలు ఆడియెన్స్​ను అలరిస్తూ బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్ కూడా అందుకున్నాయి. 'లగాన్‌', 'బోర్డర్‌', 'మంగళ్‌పాండే', 'రంగ్‌ దే బసంతీ', 'షేర్షా', 'ఎల్‌వోసీ', 'గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథా', 'ఎయిర్‌లిఫ్ట్‌', 'ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌', 'లక్ష్య', 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌', 'రాజీ' లాంటి చిత్రాలు భారీ విజయాలు మూటగట్టుకున్నాయి. మంగళవారం జెండా పండగ సందర్భంగా దేశభక్తిపై తెరపైకి రానున్న తాజా సినిమాలు ఏవంటే..

సమర సేనాని 'శ్యామ్‌ బహదూర్‌'..
Sam Bahadur Movie : 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాన్ని గెలిపించిన వ్యూహకర్త, త్రివిధ దళాల అధిపతి శ్యామ్‌ బహదూర్‌ మానెక్‌షా. జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ 'శామ్​ బహదూర్‌'. బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్‌ లీడ్​ రోల్​లో రూపొందుతున్న ఈ సినిమాలో సాన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్‌, మనోజ్‌ బాజ్‌పేయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరు 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

భారత్‌ - పాక్‌ పోరాటం 'పిప్పా'..
Pippa Movie Hindi : 'ధడక్'​ ఫేం హీరో ఇషాన్‌ ఖట్టర్‌, బాలీవుడ్ స్టార్ మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం 'పిప్పా'. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో శత్రువులను మట్టి కరిపించేందుకు పోరాడిన బ్రిగేడియర్‌ బల్‌రామ్‌ సింగ్‌ మెహతా స్వానుభవాల సమాహారమే ఈ సినిమా. 'ఎయిర్‌లిఫ్ట్‌' ఫేం రాజా కృష్ణమీనన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ , రోనీ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరు 2న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

సైనికుడి సీక్రెట్‌ ఆపరేషన్‌ 'యోధ'
Yodha Movie Hindi : 'షేర్షా' లాంటి దేశ భక్తి సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్‌ మల్హోత్రా లీడ్​ రోల్​లో మరో దేశ భక్తి సినిమా రూపొందుతోంది.'యోధ' అనే టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమానుదర్శకద్వయం సాగర్‌ ఆంబ్రే, పుష్కర్‌ ఓఝా తెరకెక్కిస్తున్నారు. భారత సైన్యానికి చెందిన ఒక సైనికుడు తీవ్రవాదుల ఆట కట్టించడానికి చేసిన సీక్రెట్‌ ఆపరేషన్​ గురించి ఈ కథ. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, శశాంక్‌ ఖైతాన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిశా పటానీ, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయాల 'మైదాన్‌'
Maidaan Movie Hindi : ఫుట్‌బాల్‌లో అట్టడుగున ఉన్న భారత జట్టును మేటిగా మలచి మన సత్తా ఏంటో చూపించారు కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం. ఆయన జట్టును ఈ స్థాయికి చేర్చేందుకు తన జీవితాన్నే త్యాగం చేశారు. ఇక ఆయన బయోపిక్‌గా 'మైదాన్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌, గజ్‌రాజ్‌రావు, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా రిలీజ్​ డేట్​ వాయిదా పడటం వల్ల.. దీని విడుదల తేదీ ఇంకా స్పష్టంగా తెలియదు.

క్విట్​ ఇండియా.. ఆ యువతి గాథ..
Ae Watan Mere Watan Movie : స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్‌ ఇండియా ఉద్యమానికి ప్రభావితురాలైన ఓ యువతి తన జీవితాన్ని ఎలా దేశానికి అంకితం చేసిందనే కథాంశంలో రూపొందుతున్న సినిమా 'ఏ వతన్‌ మేరే వతన్‌'. సారా అలీఖాన్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 30న ఈ సినిమా విడుదలవ్వనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.