Unstoppable With NBK Season 3 Ranbir Kapoor : నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమయ్యే 'అన్‌స్టాపబుల్' షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సారి అన్‌స్టాపబుల్ రేంజ్ బౌండరీలు దాటి బాలీవుడ్ దాకా వెళ్లింది. అందులో భాగంగా ఈ షోకు గెస్ట్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో బాలయ్య, రణ్‌బీర్ దిగిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో రణ్‌బీర్‌తో బాలయ్య ఏం మాట్లాడారు? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
-
#MansionHouse #ValueZone #realkhiladiofficial @MYDrPainRelief @Manepally18 @sprite_india #ambicadurbarbathi pic.twitter.com/P0rkiYcolP
— ahavideoin (@ahavideoIN) November 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#MansionHouse #ValueZone #realkhiladiofficial @MYDrPainRelief @Manepally18 @sprite_india #ambicadurbarbathi pic.twitter.com/P0rkiYcolP
— ahavideoin (@ahavideoIN) November 14, 2023#MansionHouse #ValueZone #realkhiladiofficial @MYDrPainRelief @Manepally18 @sprite_india #ambicadurbarbathi pic.twitter.com/P0rkiYcolP
— ahavideoin (@ahavideoIN) November 14, 2023
Animal Movie Release Date : రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'యానిమల్'. ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రణ్‌బీర్ అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు. రణ్‌బీర్‌తో పాటు రష్మిక, దర్శకుడు సందీప్ వంగా కూడా ఈ షోలో పాల్గొన్నారు. డిసెంబర్లో 'యానిమల్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ.. టీజర్, పాటలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'అన్‌స్టాపబుల్' లిమిటెడ్ ఎడిషన్..
Unstoppable With Nbk Limited Edition : మరోవైపు ఇప్పటికే రెండు 'అన్‌స్టాపబుల్' సీజన్లతో బాలయ్య ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంటి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులతోనూ బాలకృష్ణ చిట్ చాట్ చేశారు. ఇప్పుడు మరో మెట్టు ఎక్కి మూడో సీజన్‌తో ప్రేక్షకుల మందుకు వచ్చారు బాలయ్య. అయితే దీనికంటే ముందు 'లిమిటెడ్ ఎడిషన్' అనే పేరుతో ఆహా వేదికగా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' ప్రసారం అయింది. తొలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' టీమ్ వచ్చి సందడి చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
షారుక్ సినిమాకు తప్పని కన్ఫ్యూజన్ - రెండు డేట్ల మధ్య 'డంకీ' పోరాటం - 'సలార్' సేఫేనా?
మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్- క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ సింగర్!