ETV Bharat / entertainment

"ఇదే నా చివరి సినిమా..ఇక నా వల్ల కాదు!".. "ఈ పాలిటిక్స్ నా దగ్గర వద్దు!" - అన్​స్టాపబుల్​ పవన్​ కల్యాణ్​ ఎపిసోడ్​

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్​ సంగమం బుల్లితెరపై సాక్షాత్కారమైంది. బాలకృష్ణ అన్​స్టాపబుల్​ షోలో పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ సందడి చేశారు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఓ ప్రశ్నకు.. "ఇదే నా చివరి సినిమా..ఇక నా వల్ల కాదు!".. "ఈ పాలిటిక్స్ నా దగ్గర వద్దు!" అంటూ జవాబిచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్​పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

unstoppable with nbk
unstoppable with nbk
author img

By

Published : Jan 21, 2023, 6:49 AM IST

Updated : Jan 21, 2023, 11:28 AM IST

బుల్లితెరపై మాస్​ సంగమం సాక్షాత్కారమైంది. నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్​స్టాపబుల్​ 2 షోకు పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ గెస్ట్​గా వచ్చారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్​ ప్రోమో శుక్రవారం విడుదలయ్యింది. కాగా, ఇందులో బాలకృష్ణ చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. దీనికి అంతే జోష్​తో పపర్​ స్టార్​ సమాధానాలిచ్చారు.

పీఎస్​పీకేxఎన్​బీకే కలిసి కనిపించడం చాలా అరుదు. ఈ షోకు పవన్​ కల్యాణ్​కు గ్రాండ్​ వెల్​కమ్​ ఇచ్చారు బాలకృష్ణ. మొదట నటసింహ తనను 'బాల' అని పిలవమని పవన్​తో అన్నారు. దీనికి పవన్​ కల్యాణ్​ 'ఓడిపోవడానికి కూడా సిద్ధం' అంటూ నవ్వులు పూయించారు. అనంతరం బాలకృష్ణ ' ఈ మధ్య నీ విమర్శల్లో వాడి వేడి డబుల్​ ఇంపాక్ట్​ అయ్యింది' అని అడిగారు. పవన్​ నవ్వుతూ ' నేను చాలా పద్ధతిగా మట్లాడతానండీ' వ్యంగంగా అన్నారు. అనంతరం మీ అన్నయ్య చిరంజీవి వద్ద నుంచి నేర్చుకున్నదేంటి, వద్దనుకున్నదేంటి అనే ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దీనికి పవర్​ స్టార్ ఓరోజు వదినకు ఫోన్​ చేసి ఇదే నా లాస్ట్​ సినిమా, ఇంక నా వల్ల కాదు' అని చెప్పినట్లు సమాధానమిచ్చారు. దీనికి ఈ పాలిటిక్స్​ నా దగ్గర వద్దు అని బాలకృష్ణ అన్నారు. 'రాష్ట్రంలో మీకు ఫ్యాన్​ కాని వాడు లేడు, ఆ అభిమానం ఓట్లుగా కన్వర్ట్​ ఎందుకు కాలేదు' అని అడిగారు బాలకృష్ణ.

Last Updated : Jan 21, 2023, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.