ETV Bharat / entertainment

అన్​స్టాపబుల్​లో పవన్​కల్యాణ్.. బుల్లితెరపై మాస్​ జాతరకు డేట్​ ఫిక్స్​! - త్రివిక్రమ్ అన్​స్టాపబుల్​2 టాక్​ షో

బుల్లితెరపై మాస్​ జాతర రాబోతోంది. బాలకృష్ణ టాక్​ షోలో గెస్ట్​గా పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'అన్​స్టాపబుల్​ 2' రెండో ఎపిసోడ్​ ప్రోమోలో ఈమేరకు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు దాన్ని నిజం చేసేలా షూటింగ్​ తేదీ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

unstoppable s2 pawan kalyans episode
unstoppable s2 pawan kalyans episode
author img

By

Published : Dec 18, 2022, 4:49 PM IST

Updated : Dec 18, 2022, 5:07 PM IST

తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు ఈ మాస్​ హీరోలు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు ఎదురుపడి సంభాషించుకుంటుంటే ఏమవుతుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల మనసుల్లో మెదులుతున్నాయి. ఆ ఇద్దరే పవర్​ స్టార్ పవన్ కల్యాణ్, నటసింహం బాలకృష్ణ. వీరిద్దరూ బుల్లితెరపై సందడి చేసేలా ఉన్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్​ షో 'అన్‌స్టాపబుల్​' ఇందుకు వేదికయ్యే అవకాశముంది. అయితే దీని గురించి హింట్​ రెండో ఎపిసోడ్​లోనే వచ్చింది. కాగా, దాన్ని నిజం చేసేలా ఇప్పుడు పవన్​ కల్యాణ్​ ఎపిసోడ్​ షూటింగ్​ తేదీ కూడా నెట్టింట్లో హాట్​ టాపిక్​గా మారింది. డిసెంబర్​ 27న ఈ ఎపిసోడ్​ చిత్రీకరణ జరగబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో పవర్​ స్టార్​తో పాటు దర్శకుడు త్రివిక్రమ్​, క్రిష్​ జాగర్లమూడి కూడా సందడి చేయనున్నారట.

దీంతో సోషల్​ మీడియాలో పవన్-బాలయ్య కాంబో గురించి చర్చ మొదలైంది. బాలకృష్ణ, పవన్​ కల్యాణ్​ ఇద్దరూ తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఈ క్రమంలో పవన్​ షోకు వస్తే.. బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఒకే ఫ్రేమ్​లో ఇద్దరినీ చూడాలని అభిమానులు వేయి కళ్లతో వేచిచూస్తున్నారు.

'అన్​స్టాపబుల్​'గా దూసుకెళ్తున్న బాలయ్య..
బాలకృష్ణ హోస్ట్​గా ఓటీటీ వేదిక ఆహాలో 'అన్​స్టాపబుల్​' షో సీజన్-1 అద్భుత విజయం సాధించింది. దీంతో సీజన్-2 కూడా ప్రారంభమైంది. ఇప్పటివరకు పలువురు ప్రముఖులు వచ్చి ప్రేక్షకులను అలరించారు. ప్రభాస్​, గోపీచంద్​ ఎపిసోడ్​ డిసెంబర్​ 30న స్ట్రీమింగ్​ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Dec 18, 2022, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.