ETV Bharat / entertainment

'ఆదిపురుష్​' నుంచి మరో పాట.. 'రామ్ సీతా రామ్​'​ ఫుల్ సాంగ్​​ రిలీజ్​ - ఆదిపురుష్​ సినిమా పాటలు

Adipurush Ram Sita Ram Song : పాన్​ ఇండియా స్టార్​​ ప్రభాస్​ రాముడిగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ​ సినిమా నుంచి విడుదలైన జై శ్రీ రామ్​ సాంగ్​ శ్రోతలను బాగా ఆకట్టుకుంది. తాజాగా చిత్రం నుంచి 'సీతా రామ్​'​ సాంగ్​ ఫుల్​ వెర్షన్ విడుదలైంది.

adipurush new song
ఆదిపురుష్ పాటలు
author img

By

Published : May 29, 2023, 12:42 PM IST

Updated : May 29, 2023, 2:07 PM IST

Adipurush Ram Sita Ram Song : టాలీవుడ్​ స్టార్ హీరో ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్​'. ఇప్పటికే రిలీజైన టీజర్​, ట్రైలర్​తో సినిమాపై అభిమానులకు ఓ రేంజ్​లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చింది. ఈ సినిమాలోని రెండో పాట అయిన 'సీతా రామ్​ సాంగ్​' సాంగ్​ను చిత్ర బృందం విడుదల చేసింది. 'నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సింది రాజ భవనంలో' అని శ్రీరాముడు అనగా.. 'నా రాముడు ఎక్కడుంటే.. అదే నా రాజమందిరం. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో.. మీ జానకి వెళ్లదు' అంటూ జానకి జానక చెప్పిన సమాధానంతో ఈ పాట ప్రారంభమవుతుంది. గాయకులు కార్తీక్​, సాచేత్ టాండన్, పరంపరా టాండన్​ ఆలపించిన ఈ మెలోడియస్​ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. 2 నిమిషాల 50 సెకన్లు ఉన్న ఈ పాటకు తెలుగు లిరిక్స్​ రాయజోగయ్య శాస్త్రి రాశారు. సాచేత్​ పరంపరా సంగీతం సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Adipurush Jai shri Ram Song : ఈ పాట కంటే ముందు 'జై శ్రీరామ్'​ పాటు విడుదలైంది. 'మహిమాన్విత మంత్రం నీ నామం.. జై శ్రీరామ్​' అంటూ సాగే సాంగ్ విడుదలైంది. ఈ పాట​ ఫ్యాన్స్​కు గూస్​బంప్స్​ తెప్పించింది. ఈ పాటకు అజయ్-అతుల్​ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
Adipurush Business : ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 16న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్​ భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియెట్రికల్​ రైట్స్​ను భారీ మొత్తానికి పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తీసుకుందని తెలుస్తోంది. రూ. 170 కోట్లు కొనుగోలు చేసిందని సమాచారం. అయితే, అంతకుముందు ఈ హక్కులను యూవీ క్రియేషన్స్​ సంస్థ రూ.100 కోట్లకు కొని.. రూ. 70 కోట్ల లాభంతో పీపుల్స్​ మీడియా సంస్థకు అమ్మిందని ప్రచారం జరుగుతోంది.

Adipurush Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. రామాయణ మహా కావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా రెబల్​ స్టార్​ ప్రభాస్​ నటిస్తున్నారు. సీతా దేవిగా బాలీవుడ్​ నటి కృతిసనన్​ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్​, హనుమంతునిగా దేవదత్త్​ నాగే, రావణుడి పాత్ర సైఫ్​ అలీ ఖాన్​ పోషిస్తున్నారు. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్, సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్​ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లను ప్రారంభించిన మూవీ టీమ్​.. కొత్త పోస్టర్లు, లిరికల్‌ సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

Last Updated : May 29, 2023, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.