Tollywood latest updates: సమంత, నయనతార, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ చిత్రం 'కాతువాకుల రెండు కాదల్'. తెలుగులో 'కణ్మణి రాంబో ఖతీజా' అనే పేరుతో విడుదల కానుంది. విఘ్నేష్ శివన్ దర్శకుడు. గురువారం షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెట్స్‌లో చిత్ర బృందం సందడి చేసింది. నాయికానాయికలు, దర్శకుడు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లవ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రౌడీ పిక్చర్స్‌తో కలిసి 7 స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని ఏప్రిల్ 28న విడుదలకానుంది.
![Tollywood latest updates:](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14892308_fpk6vssvgaenxfw-3.jpg)
![Tollywood latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14892308_fpk6vssvgaenxfw-2.jpg)
టైగర్ అప్డేట్
రవితేజ ప్రధాన పాత్రలో పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'టైగర్ నాగేశ్వర రావు' నుంచి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నుపూర్ సనన్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. నుపూర్.. ప్రముఖ కథానాయిక కృతి సనన్ చెల్లలే కావడం విశేషం. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. 'ది కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్' అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం జరగనుంది.
![Tollywood latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14892308_fpk6vssvgaenxfw-4.jpg)
• యువ నటుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ సినిమాలోని 'రాంసిలక' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఈ ఏడాది అత్యుత్తమ బ్రేకప్ సాంగ్‌గా నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
• కిచ్చా సుదీప్ నటిస్తున్న విక్రాంత్ రోనా తెలుగు టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2న ఉదయం 9.55 గంటలకు టీజర్ విడుదల కానుంది. జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ సమర్పణలో శాలినీ ఆర్ట్స్ ప్రొడక్షన్లో సినిమా రూపొందుతోంది.
![Tollywood latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14892308_fpk6vssvgaenxfw-1.jpg)
• తమిళ అగ్రనటుడు విజయ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 2న ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
![Tollywood latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14892308_beast.jpg)
• పూరి జగన్నాథ్.. తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'జేజీఎం'పై దృష్టిపెట్టారు. ఇటీవలే విలేకరుల సమావేశం పెట్టి చిత్ర విశేషాలు పంచుకున్నారు. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఆర్మీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా, చిత్రబృందం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసింది.
![Tollywood latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14892308_fpk5egyaaaoinsn.jpg)
ఫుల్ వీడియోతో..
శర్వానంద్, రష్మిక సినీ అభిమానులకు కానుక అందించారు. తామిద్దరు కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలోని 'ఆద్య' ఫుల్ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులోని బీచ్, గుడి తదితర అందమైన లొకేషన్లు, శర్వానంద్ కూల్ డ్యాన్స్, రష్మిక అందం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని యాజిన్ నైజర్ ఆలపించగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. ఈ కుటుంబ కథా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: విల్‌స్మిత్‌పై చర్యలు.. త్వరలో సస్పెన్షన్! ఆస్కార్ వెనక్కి?