ETV Bharat / entertainment

సమంతపైనే భారమంతా.. అనుకున్నట్టే జరుగుతుందా? - సమంత శాకుంతలం ఓపనింగ్స్

టాలీవుడ్ స్టార్​ హీరోయిన్​ నటించిన లేటెస్ట్ మూవీ 'శాకుంతలం'. ఏప్రిల్​ 14న ధియేటర్లలో ఈ మూవీ సందడి చేయనుంది. దీని కోసం ఇప్పటికే అలుపెరగకుండా ప్రమోషన్లలో పాల్గొంది సమంత. మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్​ను ఇస్తుందో?

samantha shaakuntalam
samantha shaakuntalam
author img

By

Published : Apr 13, 2023, 1:12 PM IST

ఇంకొక్కరోజులో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది 'శాకుంతలం'. టాలీవుడ్​ హీరోయిన్​ సమంత లీడ్​ రోల్​లో ఈ సినిమా రూపొందింది. 'యశోద' లాంటి సూపర్ హిట్ తర్వాత సామ్ చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్​, సాంగ్స్​తో ఈ సినిమాకు మంచి బజ్​ లభించింది. అంతే కాకుండా ఇందులో సామ్​ లుక్స్​ కూడా అదిరిపోయేలా ఉండటంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే సినిమా స్టార్ట్​ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ తానై చూసుకుంది సామ్​. ఓ వైపు తన ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే మరోవైపు సినిమా షూటింగ్​లో పాల్గొని సక్సెస్స్​ఫుల్​గా కంప్లీట్​ చేసింది. ఇక చిత్రీకరణ తర్వాత కూడా తన తదుపరి ప్రాజెక్ట్స్​ షూట్​లో పాల్గొంటూనే శాకుంతలం ప్రమోషన్లను కూడా ఒంటి చేత్తో హ్యాండిల్​ చేస్తూ వస్తోంది. ప్రమోషన్స్​లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలతో పాటు షోస్​ లోనూ మెరిసింది! ఈ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిని గుర్తుచేసుకుని కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలా అనారోగ్యంగా ఉన్నప్పటికీ చికిత్స తీసుకుంటూనే ప్రమోషన్స్​ యాక్టివ్​గా పాల్గొంది. ఇలా సినిమా స్టార్టింగ్​ నుంచి ఇప్పటి వరకు ఎంతో శ్రమించింది సామ్​.

మరోవైపు ఈ సినిమా రిలీజయ్యేందుకు రెండు రోజుల ముందే ఓ స్పెషల్ ప్రీమియర్​ను వేశారు మూవీ టీమ్​. దీన్ని చూసిన అందరూ సమంత నటన గురించే చర్చించుకుంటున్నారు. శకుంతల దేవి పాత్రలో సామ్ లీనమై నటించి అందరిని ఆకట్టుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్​ ఉన్నప్పటికీ హీరోయిన్​ పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అంతే కాకుండా ఈ సినిమాలో దుష్యంత్ మహారాజ్​ పాత్రలో నటించిన మలయాళ హీరో దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు అంత సుపరిచితుడు కాదు. ఆయనకు ఇది తొలి స్ట్రైట్​ సినిమా. దీంతో శాకుంతలంకి ఓపెనింగ్స్ తెచ్చే భారమంతా మన సమంత పైనే పడింది.

ఇప్పటికే సామ్​ పలు లేడీ ఓరియెంటెడ్​ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది.'ఓ బేబీ', యశోద లాంటి సినిమాలతో సామ్​ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రిలీజైన మూడు, నాలుగు రోజుల పాటు ఫ్యామిలీ ఆడియెన్స్​ను థియేటర్లకు రప్పించి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక అదే ఫార్ములా ఈ సినిమాకు కూడా అమలవుతోందన్న ఆశలతోనే ఇప్పుడు దర్శక నిర్మాతలైన గుణ శేఖర్, దిల్ రాజు ధీమాగా ఉన్నారు. మంచి కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకి ప్రేక్షకులను తీసుకొచ్చే మొత్తం బాధ్యత సమంత మీదే ఉందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి టాక్​ను అందుకుంటుందో, ఎంత వసూళ్లను అందుకుంటుందో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.