ETV Bharat / entertainment

నిరాశపరిచిన హిందీ 'ఛత్రపతి'!.. తొలి రోజు కలెక్షన్స్​ ఎంతంటే? - హిందీ ​ ఛత్రపతి డే 1 కలెక్షన్స్​

Chatrapathi First day collection : బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'ఛత్రపతి' హిందీ రీమేక్​ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా తొలి కలెక్షన్లు ఎంతంటే?

Bellamkonda Srinivas hindi  Chatrapati First day collections
Chatrapati 2023 First day collections
author img

By

Published : May 13, 2023, 12:54 PM IST

Updated : May 13, 2023, 1:50 PM IST

Chatrapathi 2023 Movie : టాలీవుడ్​ స్టార్​ బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ ఛత్రపతి హిందీ రీమేక్​తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి దాకే తెలుగు ఇండస్ట్రీకే పరిమితమైన ఈ స్టార్​.. తొలి సారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హిందీ సినిమాలో మెరిశారు. మే 12న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. తెలుగులో సూపర్ హిట్​ అయిన సినిమాతో అక్కడ హిట్​ కొడుదామని ఆశించారు. అయితే ఆయనకు నిరాశే మిగిలింది!

ఇండియా మొత్తం కలిపి ఈ సినిమాకు ఫస్ట్​ డే కేవలం రూ.60 లక్షలు మాత్రమే కలెక్షన్స్ వచ్చినట్లు సమచారం. ఓవర్సీస్‌లో రూ.10 లక్షల మేర వసూళ్లు చేసిందని అంచనా. మొత్తం కలిపి తొలి రోజు ఈ సినిమా రూ.70 లక్షలు మాత్రమే వసూలు చేసిందట. దీంతో ఈ మూవీ యూనిట్​కు గట్టి షాకే తగిలినట్టైంది! నిజానికి బాలీవుడ్​లో​ బెల్లంకొండ నటించిన డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్​ ఉంది. ఆ కారణంతోనే అక్కడ స్ట్రైట్​​ మూవీ తీద్దామని అనుకున్నారు. కానీ అనుకున్నది జరగలేదు. అయితే తొలి రోజు కలెక్షన్లతో సినిమా రిజల్ట్​పై ఓ అభిప్రాయానికి రాలేదమని మరికొందరు అంటున్నారు.

మాస్​ ఆడియెన్స్​కు విపరీతపంగా కనెక్ట్​ అయిన బెల్లంకొండకు సౌత్​తో పాటు నార్త్​లోనూ మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. ఆయన నటించిన 'జయ జానకీ నాయక', 'సీత', 'అల్లుడు శీను', 'సాక్ష్యం' లాంటి సినిమాలన్నీ యూట్యూబ్​లో రికార్డు స్థాయిలో వ్యూస్​ సంపాదించాయి. తన యాక్షన్​ మూవీస్​తో టాలీవుడ్​ను షేక్​ చేసిన వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కూడా ప్లస్​ పాయింట్​ అవుతుందని అనుకున్నారు. కానీ అనుకున్నవేమి జరగలేదు. ఇదే ధీమాతో ఈ హిందీ రీమేక్​పై కొండంత ఆశలు పెట్టుకున్నారు.

రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి'.. డార్లింగ్​ ప్రభాస్​కు బ్రేక్​ ఇచ్చిన సినిమాల్లో ఒకటి. ప్రభాస్​ ఈ సినిమాతో అటు క్లాస్​ ఆడియెన్స్​తో పాటు ఇటు మాస్​ ఆడియెన్స్​లో మంచి క్రేజ్​ సంపాదించుకున్నారు. ఇక ఇందులోని యాక్షన్​ సీన్స్ గూస్​బంప్స్​ తెప్పిస్తే.. సెంటిమెంట్​ సీన్స్​ అభిమానుల చేత కంటతడి పెట్టిస్తుంది. అంతే కాకుండా భానుప్రియ, అజయ్​, ఛత్రపతి శేఖర్​ తమ క్యారెక్టర్లలో లీనమైపోయి నటించారు. విలన్​గా నటించిన ప్రదీప్​ రావత్​ బాగా సెట్​ అయ్యారు. దీంతో తెలుగు ఛత్రపతి బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. అయితే హిందీ రీమేక్​లో మాత్రం ఈ మధర్ సెంటిమెంట్​, ప్రదీప్​ రావత్​ విలనింజం ఎలిమెంట్స్​ ఏవీ బాగా పండలేదని అభిప్రాయపడుతున్నారు. యాక్షన్స్​ సీన్స్​ బాగా తెరకెక్కించినప్పటికీ చెప్పుకోదగ్గ సీన్స్​ ఏవీ లేవని అంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : May 13, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.