ETV Bharat / entertainment

'తెలుగు చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి.. కళాతపస్వి విశ్వనాథ్​'

ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 60కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ శంకరాభరణం చిత్రం విడుదల తేదీనే విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

tollywood director k viswanath passes away
tollywood director k viswanath
author img

By

Published : Feb 3, 2023, 7:35 AM IST

Updated : Feb 3, 2023, 10:29 AM IST

ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న 92 ఏళ్ల కె. విశ్వనాథ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్​లోని అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కె.విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇది అత్యంత విషాదకరమైన రోజు: చిరంజీవి
కె.విశ్వనాథ్ మృతిపట్ల మెగాస్టార్​ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు."పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్‌ ఫిల్మ్స్‌ని కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు. ఆయన దర్శకత్వంలో 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధం. అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైంది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్‌లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్‌లాంటివి. 43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్‌ చిత్రం 'శంకరాభరణం' విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనది. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"

కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ : బాలకృష్ణ
"కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు క‌న్నుమూయ‌డం తెలుగు చ‌ల‌న‌చిత్ర పరిశ్రమకు తీర‌ని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చ‌ల‌న‌చిత్ర పరిశ్రమకే వ‌న్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. క‌ళా త‌ప‌స్వి ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను" -నందమూరి బాలకృష్ణ3

ఆయన ఓ బహుముఖ దర్శకుడు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
"శ్రీ కె విశ్వనాథ్ గారు మరణించినందుకు విచారం వ్యక్తం చేశారు. ఆయన సినీ ప్రపంచానికి ఒక సృజనాత్మక, బహుముఖ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన సినిమాలు దశాబ్దాలుగా వివిధ శైలులను కవర్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి."

మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
"సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన శ్రీ విశ్వనాథ్ గారు, దర్శకుడిగా తొలి అడుగునే నంది అవార్డుతో ప్రారంభించారు. భాష, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేస్తూ, అగ్రకథానాయకుల్ని సైతం ఆదర్శనీయ పాత్రల్లో చూపిన వారి చిత్రాలు ఆనందాన్ని, సందేశాన్ని అందించి ఆదర్శంగా నిలిచాయి." - వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

ఆయన చేసిన కళాసేవ అజరామరం : కమల్‌హాసన్​
"జీవిత పరమార్థాన్ని, కళ సజీవమైనదని పూర్తి అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ అజరామరం. ఆయన తదనంతరం కూడా అది బతికే ఉంటుంది".
నాకు స్ఫూర్తినింపిన వాళ్లలో ఆయన ఒకరు: క్రిష్‌
"లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతి నన్ను తీవ్రంగా కలిచి వేసింది. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌, కథను చెప్పే విధానం, పని పట్ల నిబద్ధత నాలాంటి ఎంతోమంది సినీ దర్శకులకు స్ఫూర్తి".

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో కె.విశ్వనాథ్​ది ఉన్నతమైన స్థానమని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 'శంకరాభరణం', 'సాగర సంగమం' లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారని తెలిపారు. విశ్వనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జూనియర్​ ఎన్టీఆర్​ ట్వీట్ చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్ , సంగీత దర్శకుడు థమన్ సహా గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ కె.విశ్వనాథ్ మృతి తీరని లోటని ట్వీట్ చేశాయి.

ప్రముఖులు, అభిమానులు ట్విట్టర్ వేదికగా 'రిప్ లెజెండ్ ' పేరిట కళాతపస్వికి నివాళి అర్పిస్తున్నారు. కె. విశ్వనాథ్ మృతితో గాడ్ ఫాదర్​ను కోల్పోయామని పూర్ణోదయ ఆర్ట్స్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏడిద నాగేశ్వర్రావు కుమారులు కె.విశ్వనాథ్ పార్ధీవదేహానికి నివాళి అర్పించారు. కళాతపస్వి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా తమకు వ్యక్తి గతంగా తీరని లోటన్నారు.

  • Shocked beyond words!
    Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z

    — Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Feb 3, 2023, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.