ETV Bharat / entertainment

టాలీవుడ్ ఆశలన్నీ ఆగస్ట్​పైనే! పరాజయాలకు ఫుల్​స్టాప్​ పడేనా? - undefined

మన చిత్రసీమ విజయాన్ని చూసి ఎన్నాళ్లైందో! క్యాలెండర్‌లో పేజీలు మారిపోతున్నాయి. నెలలు గడిచిపోతున్నాయి. వారం వారం సినిమాలు వస్తూనే ఉన్నాయి. విజయం అన్న మాటే ఎంతకీ వినపడటం లేదు.రూ.వందల కోట్ల వసూళ్లతో కళకళలాడిన మన బాక్సాఫీసు దగ్గర ఉన్నట్టుండి సందడి కరవైంది. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. నిర్మాతలు చిత్రీకరణలు ఆపేసి మరీ ఆలోచించుకునేంత సంక్షోభ స్థితికి చేరుకుంది చిత్ర పరిశ్రమ. జులైలో ఒక్కటంటే ఒక్క విజయమూ దక్కలేదు సరికదా... కొన్ని సినిమాలకి దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఈ పరిస్థితులకి దారితీసిన కారణాల్ని అన్వేషిస్తుండగానే... మరో సినీ శుక్రవారం ప్రేక్షకుడి ముంగిటకి వచ్చింది. ఇప్పుడు పరిశ్రమ ఆశలన్నీ ఈ నెలలో వస్తున్న సినిమాలపైనే. ఆసక్తికరమైన కలయికల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాల్లో కొన్ని విజయాల్ని దక్కించుకున్నా పరిశ్రమ మళ్లీ ఊపిరి తీసుకోవడం ఖాయం.

august new movies 2022
టాలీవుడ్ ఆశలన్నీ ఆగస్ట్​పైనే! పరాజయాలకు ఫుల్​స్టాప్​ పడేనా?
author img

By

Published : Aug 5, 2022, 6:53 AM IST

తెలుగు సినిమా బాక్సాఫీసు గురించి పొరుగు పరిశ్రమలు సైతం కథలు కథలుగా చెప్పుకొంటాయి. మంచి చిత్రం అనుకుంటే చాలు... భాషతో సంబంధం లేకుండా చూసి వసూళ్లు కట్టబెట్టే సినీ ప్రేమికులు తెలుగు ప్రేక్షకులు. బాక్స్‌ఫీసును వందల కోట్లతో నింపగలరు. వేసవిలో విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో మరోమారు ఇది రుజువైంది. అలాంటి బాక్సాఫీసు ఒక్కసారిగా కళ తప్పింది. 'మేజర్‌', 'విక్రమ్‌' విజయాల తర్వాత 'ప్రేక్షకులకు కావల్సిన కంటెంట్‌ని ఇవ్వలేకపోవడంతోనే ఈ పరిస్థితులు' అనే నిర్ణయానికొస్తున్నారు సినీ పండితులు. తమవైపు నుంచి జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దే దిశగా నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఈ దశలోనే విడుదలవుతున్న చిత్రాలు ఇటు ప్రేక్షకుల్లోనూ... అటు పరిశ్రమలోనూ కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయి.

అంచనాలు పెంచాయి
'అద్భుతమైన చిత్రాలొస్తే తప్ప ఆదరించడం లేదు. అలాంటివి రావాలన్నది ఇప్పుడు ప్రేక్షకుల డిమాండ్‌' అని చెప్పారు ఇటీవల 'బింబిసార' వేడుకలో కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన మాటలతో ట్రేడ్‌ వర్గాలు ఏకీభవిస్తున్నాయి కూడా. ఇందులో ఏదో ఉందనే ఉత్సుకత ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుడిలో రేకెత్తించాలి. పాటలతోనూ కట్టిపడేయాలి. థియేటర్లకి వచ్చాక కథ, కథనాలతోనూ.. ఇతరత్రా హంగులపరంగా ప్రేక్షకుడికి ప్రత్యేకమైన అనుభూతిని పంచాల్సిందే. ఈ శుక్రవారం విడుదలవుతున్న 'బింబిసార', 'సీతారామం' ప్రచార చిత్రాలు చేసిన హంగామా ప్రేక్షకుడి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. వాటి నిర్మాణంలోనూ నాణ్యతని చాటి చెప్పాయి నిర్మాణ సంస్థలు. కథ, కథనాల పరంగా ఆ మేజిక్‌ కొనసాగిందంటే విజయాలు ఖాయమనేది ట్రేడ్‌ వర్గాల మాట. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'బింబిసార'తో వశిష్ఠ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన 'సీతారామం'ని హను రాఘవపూడి తెరకెక్కించారు. 'సీతారామం' పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంది.

ఆఖర్లో 'లైగర్‌' హంగామా
ఈ నెల 25న విజయ్‌ దేవరకొండ 'లైగర్‌' విడుదలవుతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే ప్రచార హంగామాతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు నాయకానాయికలు విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మైక్‌టైసన్‌ నటించడం విశేషం.

* బాక్సాఫీసు దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ... కథలపైనా, కలయికలపైనా నమ్మకంతో ఈ నెలలో విడుదలవుతున్న చిత్రాలన్నీ ముందస్తు వ్యాపారంలో జోరు చూపించాయి. వీటితోపాటుగా.. ఆది సాయికుమార్‌ నటించిన ‘తీస్‌మార్‌ ఖాన్‌’తోపాటు మరికొన్ని ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వీటిలో కొన్ని అనువాద చిత్రాలూ ఉన్నాయి. స్టార్‌ కథానాయకుల చిత్రాలు కాకపోయినప్పటికీ బాక్సాఫీసు మాత్రం ఆగస్టు ప్రాజెక్టులపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కథనే స్టార్‌గా పరిగణిస్తున్న ట్రెండ్‌ ఇది. మరి ఆయా కథలు, కలయికలు సినిమాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయనేది ఈ రోజు విడుదలవుతున్న చిత్రాలతో కొంతమేర తేలనుంది.

వరుసగా మూడు
వచ్చే వారం వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆగస్టు 11న 'లాల్‌సింగ్‌ చడ్డా' విడుదలవుతోంది. ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలకపాత్ర పోషించడం, తెలుగులో చిరంజీవి సమర్పణలో విడులదవుతుండంతో అందరిలోనూ ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి. ఆమిర్‌ఖాన్‌ దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో పక్కాగా ప్రచారం చేసి విడుదల చేస్తున్నారు. ఆగస్టు 12న నితిన్‌ 'మాచర్ల నియోజకవర్గం' విడుదలవుతోంది. వాణిజ్య ప్రధానమైన ఈ సినిమాతో ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 13న నిఖిల్‌ 'కార్తికేయ2' విడులదవుతోంది. విజయవంతమైన 'కార్తికేయ'కి కొనసాగింపుగా ఓ కొత్త కథతో చందు మొండేటి ఈ చిత్రాన్ని తెర కెక్కించారు. ఆయా సినిమాల ట్రైలర్లు ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.