Tiragabadara Saami Teaser Launch : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరో లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'తిరగబడరా సామి'. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జెబి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకు భాష్య శ్రీ మాటలు రాస్తున్నారు. ఇక రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి, మకరంద్ దేశ్‌పాండే లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.
Director Kisses Mannara Chopra : ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. దీని కోసం ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో మూవీ టీమ్ పాల్గొని సందడి చేస్తుండగా.. దర్శకుడు రవికుమార్ చేసిన ఓ పని అందరిని షాక్‌కు గురి చేసింది. ఈవెంట్లో ఆయన హీరోయిన్ మన్నారా చోప్రా భుజంపై చెయి వేసి నిలబడటమే కాకుండా ఆమెకు ముద్దు పెట్టారు. దీంతో హీరోయిన్ షాక్‌లో ఉంటూనే ఓ స్మైల్ ఇచ్చినట్లు స్పందించింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవ్వగా.. దర్శకుడు చేసిన ఈ పనికి నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇలాంటి ఘటనలు కూడా గతంలో చాలానే జరిగాయి. ఓసారి సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు స్టేజ్ మీదే కాజల్‌కు ముద్దు పెట్టగా.. అది క్షణాల్లో వైరలైంది. నెటిజన్లు సైతం ఆయన చేసిన పనికి తీవ్రంగా ట్రోల్ చేశారు. దీంతో చివరికి కాజల్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానంటూ చోటా క్లారిటీ ఇచ్చారు.
ఇక దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి కెరీర్ విషయానికొస్తే.. 'వీరభద్ర','యజ్ఞం', 'పిల్లా నువ్వులేని జీవితం', 'సౌఖ్యం' లాంటి సినిమాలను తెరకెక్కించారు. హీరోయిన్ మన్నారా చోప్రా కూడా గతంలో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగరయ్యారు. 'రోగ్', 'జక్కన్న', 'తిక్కా' సినిమాల్లో నటించారు. అయితే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Raj Tarun Latest Movie : 'బాలయ్య సినిమా టికెట్ కోసం మర్డర్'.. 'తిరగబడరా సామి'