ETV Bharat / entertainment

'థ్యాంక్‌ గాడ్‌' ట్రైలర్​ రిలీజ్​.. తెలుగులో శింబు సందడి

Thank God Movie Trailer : బాలీవుడ్​ కథానాయకులు అజయ్‌ దేవ్‌గణ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర కలిసి నటించిన చిత్రం 'థ్యాంక్‌ గాడ్‌'. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను చిత్ర బృందం విడుదల చేసింది. తమిళ హీరో శింబు, ప్రముఖ డైరక్టర్​ గౌతమ్​ మీనన్​ కలయికలో వస్తున్న చిత్రం 'వెందు తనిందతు కాడు'. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు.

telugu cinema updates
telugu cinema updates
author img

By

Published : Sep 9, 2022, 8:50 PM IST

Thank God Movie Trailer : బాలీవుడ్‌ హీరోలు అజయ్‌ దేవ్‌గణ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర కలిసి నటిస్తోన్న చిత్రం 'థ్యాంక్‌ గాడ్‌'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఇంద్ర కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. సిద్ధార్థ్‌ కారు ప్రమాదానికి గురైన సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. ఎమోషన్‌ ప్లస్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కారు ప్రమాదం.. కట్‌ చేస్తే, అజయ్‌ దేవ్‌గణ్‌ చిత్ర గుప్తుడిగా (యమలోకంలో) ఎంట్రీ ఇవ్వడం.. మానవుల పాపపుణ్యాల చిట్టా రాయటం నా పని అంటూ చెప్పటం మెప్పిస్తాయి. అజయ్‌ ఆడించిన ఆట 'గేమ్‌ ఆఫ్‌ లైఫ్‌'లో భాగంగా కోపం, ఈర్ష్య తదితర భావోద్వేగాలు ప్రదర్శించి సిద్ధార్థ్‌ ఆకట్టుకున్నాడు. స్టైలిష్‌ చిత్ర గుప్తుడిగా అజయ్‌ అదరగొట్టారు. సిద్ధార్థ్‌ నవ్వులు పంచారు. రకుల్‌ పోలీసు అధికారిణిగా కనిపించారు. మరి, చిత్ర గుప్తుడు, సిద్ధార్థ్‌ల ఆట ఎంత వరకూ సాగింది? తన జీవితాన్ని కోల్పోయిన సిద్ధార్థ్‌ తిరిగి పొందుతాడా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగులో సందడి చేయనున్న శింబు..
శింబు ప్రధాన పాత్రలో దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ రూపొందించిన తమిళ చిత్రం 'వెందు తనిందతు కాడు'. సిద్ధి ఇద్నాని కథానాయిక. రాధిక కీలక పాత్ర పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్‌ సంస్థ.. 'ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు' పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా టైటిల్‌ పోస్టర్‌ను పంచుకుంది. లుంగీ ధరించి, గ్రామీణ యువకుడి పాత్రలో అమాయకంగా కనిపించారు శింబు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథతో తెరకెక్కినట్టు, శింబు ద్విపాత్రాభినయం చేసినట్టు ఇటీవల విడుదలైన తమిళ ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకి ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. గౌతమ్‌, శింబు, రెహమాన్‌ కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన క్లాసిక్‌ ప్రేమకథ 'విన్నైతాండి వరువాయా' (ఏమాయ చేశావే) సూపర్‌ హిట్‌గా నిలిచింది. దాంతో, ఈ కొత్త చిత్రంపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి: 'త్వరలో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తా.. డబ్బు ఎలా సంపాదించాలో తెలిసింది!'

'మహర్షి' రైతు ఇకలేరు.. అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.