ETV Bharat / entertainment

కొత్త దారుల్లో.. సరికొత్త సవాళ్లతో కథానాయికలు - తెలుగు హీరోయిన్లు

మన కథానాయికలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. కొత్త దారుల్లో సరికొత్త సవాళ్లతో సవారీ చేస్తూ.. మార్కెట్‌ పరిధిని విస్తృతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వైవిధ్యభరితమైన కథలతో తమ ప్రతిభను కొత్త చిత్రసీమలకు రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

telugu heroines latest news
telugu heroines latest news
author img

By

Published : Nov 13, 2022, 6:47 AM IST

రోజూ ఒకే బాటలో పయనం సాగించడం నిరాసక్తతకు దారితీస్తుంది. అదే నూతన మార్గాల్ని ఎంచుకుంటే ఆ ప్రయాణంలో కొత్త అనుభూతుల్ని ఆస్వాదించొచ్చు. ప్రస్తుతం మన కథానాయికలు ఇదే పంథాను అనుసరిస్తున్నారు. కొత్త దారుల్లో సరికొత్త సవాళ్లతో సవారీ చేస్తూ.. మార్కెట్‌ పరిధిని విస్తృతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వైవిధ్యభరితమైన కథలతో తమ ప్రతిభను కొత్త చిత్రసీమలకు రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

హిందీలో సత్తా చాటేందుకు..
వెండితెరపై సమంత సినీ ప్రయాణం మొదలై పుష్కర కాలం పూర్తి కావొస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఇంతకాలం దక్షిణాదికే పరిమితమైన తన ప్రతిభను.. ఇప్పుడు ఉత్తరాది సినీప్రియులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది సామ్‌. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌తో ఓటీటీ వేదికగా హిందీ ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. ఇప్పుడు వెండితెర వేదికగా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోంది. ‘స్త్రీ’ సినిమాతో మెప్పించిన దర్శకుడు అమర్‌ కౌశిక్‌తో సమంత తన తొలి హిందీ చిత్రం చేయనుందని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆమెతో తాప్సీ ఓ చిత్రం నిర్మించనున్నట్లు గతంలో ప్రకటించింది. మరి వీటిలో ముందుగా పట్టాలెక్కేది ఏదన్నది ఇప్పటికైతే తేలకున్నా.. వచ్చే ఏడాదిలో సామ్‌ బాలీవుడ్‌ తెరపై కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె హిందీలోనే వరుణ్‌ ధావన్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్‌ చేస్తోంది. ‘సిటాడెల్‌’కు రీమేక్‌ ఇది. నాయికా ప్రాధాన్య చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ.. దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. ఇప్పుడామె ‘జవాన్‌’తో బాలీవుడ్‌లోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమైంది. షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా కనిపించనుంది నయన్‌. ఈ చిత్రం.. వచ్చే ఏడాది జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సామ్‌.. నయన్‌ బాటలోనే హిందీ సినీప్రియుల్ని పలకరించనున్న మరో దక్షిణాది అందం అమలాపాల్‌. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపించిన ఈ నాయిక.. ఇప్పుడు ‘భోలా’తో బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘ఖైదీ’కి రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తళుక్కున మెరవనుంది అమలా పాల్‌. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది ఇంత వరకు తేలలేదు.

.

మలయాళ సీమలో మెరిసేందుకు..
రెండు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడానికి మరో రెండేళ్ల దూరంలో ఉంది నటి తమన్నా. అవకాశాలు అందుకునే విషయంలో ఇప్పటికీ నవతరం నాయికలకు దీటుగానే జోరు చూపిస్తోంది. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మరాఠి భాషల్లో సత్తా చాటిన ఈ నాయిక ఇప్పుడు ‘బాంద్రా’ అనే చిత్రంతో తొలిసారి మలయాళ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. దిలీప్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని అరుణ్‌ గోపీ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్‌’లో నటిస్తోంది. సత్యదేవ్‌తో కలిసి నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో తొలి సినిమాతోనే సినీప్రియుల మది దోచిన కథానాయిక కృతి శెట్టి. తొలి చిత్ర విజయంతోనే స్టార్‌ నాయికగా మారిన ఆమె.. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ జోరు చూపిస్తోంది. ఇటీవలే తమిళ చిత్రసీమలోకి అడుగు పెట్టి.. అక్కడ సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడీ అందాల సోయగం మలయాళ చిత్రసీమ నుంచీ పిలుపు అందుకుంది. టివినో థామస్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘అజయంతే రందం మోషణం’ చిత్రంలో ఓ నాయికగా సందడి చేయనుంది కృతి. జితిన్‌ లాల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది రానుందట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.