ETV Bharat / entertainment

'సినీ కార్మికులు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు' - తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​

సినీ కార్మికులు సమ్మెకు వెళ్లాలంటే పరిశ్రమలోని నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్​ఛాంబర్​కు నోటీసు ఇవ్వాలన్నారు అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు అందలేదని స్పష్టం చేశారు. కార్మికులు గతంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

kollu-ramakrishna
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లు రామకృష్
author img

By

Published : Jun 22, 2022, 5:41 AM IST

సినీ కార్మికుల సమ్మె ప్రకటనపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ స్పందించారు. పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్‌ఛాంబర్‌కు నోటీసు ఇవ్వాలన్నారు. అలాంటి నోటిసు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేశారు. నిర్మాతలు బుధవారం సజావుగా షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని సూచించారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఎలాంటి లేఖ రాలేదని పేర్కొన్నారు.

గతంలో నిర్మాతలకు రూ.2కోట్ల నష్టం.. కార్మికుల వేతనాలపై నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌ కౌన్సిల్‌ భేటీలో చర్చిస్తామని వివరించారు రామకృష్ణ. ఈ మేరకు బుధవారం షూటింగ్‌ చేసుకోవచ్చని నిర్మాతలకు సూచించారు. నాలుగేళ్లుగా తమ వేతనాలు పెంచడం లేదంటూ సినీ కార్మికులు.. బుధవారం నుంచి షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అయితే, గత నెలలో కార్మిక సంఘాల్లోని స్టంట్‌ యూనియన్‌ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షూటింగ్‌లకు వెళ్లకపోవడంతో నిర్మాతలకు రూ.2కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్న రామకృష్ణ. ఆ ఘటనపై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ను వివరణకోరామని తెలిపారు. కానీ, ఫెడరేషన్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఇప్పుడు కార్మికులు మళ్లీ అదే తప్పు చేస్తున్నారని ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: సినీ కార్మికుల నిరసన.. షూటింగ్​లు బంద్​.. కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.