ETV Bharat / entertainment

తాప్సీ 'శభాష్​ మిథు' రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. 'ది ఫ్యామిలీ మ్యాన్​' క్రేజీ అప్డేట్​! - the family man webseries

Movie Updates: సినీ అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో తాప్సీ నటించిన 'శభాష్​ మిథు' సినిమాతో పాటు ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను కట్టిపడేసిన 'ది ఫ్యామిలీ మ్యాన్​' వెబ్​సిరీస్​ సంగతులు ఉన్నాయి.

Movie update latest
Movie update latest
author img

By

Published : Apr 29, 2022, 4:35 PM IST

Tapsee Shabhash Mithu Release Date: భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​ జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా 'శభాష్​ మిథు'. తాప్సీ ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా టీజర్​ విడుదలై ఆకట్టుకుంది. శ్రీజిత్​ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వయాకామ్​ 18 స్టూడియోస్​ నిర్మించింది. తాజాగా మేకర్స్​ రిలీజ్​ తేదీని ప్రకటించారు. జులై 15న పాన్​ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ఒక రోజు ముందే రామ్ పోతినేని హీరోగా న‌టిస్తున్న 'ది వారియ‌ర్' చిత్రం విడుద‌ల కానుంది. ఎన్.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. మ‌రి రామ్‌తో పోటీని త‌ట్టుకుని తాప్సీ నిలుస్తుందా లేదా చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Family Man season 3 update: 'ది ఫ్యామిలీ మ్యాన్'​.. అమెజాన్​ ప్రైమ్​ వీడియోలోని ఈ వెబ్​ సిరీస్​కు నెక్స్ట్​ లెవెల్​ ఫ్యాన్​ బేస్​ ఉంది. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు దుమ్మురేపాయి. తాజాగా.. ఫ్యామిలీ మ్యాన్​ సీజన్​ 3 గురించి ఓ వార్త బయటకొచ్చింది. 'ది ఫ్యామిలీ మ్యాన్​ న్యూ సీజన్​' అంటూ ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో అమెజాన్​ ప్రైమ్​ చేసిన పోస్ట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. 'చెల్లం సర్​కి కాల్​ చెయ్​.. ఈ వార్త నిజమేనని ఆయన చెబుతారు,' అంటూ ఇంగ్లీష్​లో క్యాప్షన్​ ఇచ్చారు. దీతో ఈ వెబ్​ సిరీస్​ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అయితే.. సీజన్​ 3 రిలీజ్​ ఎప్పుడు ఉంటుంది? ఇందులో కనిపించే నటుల వివరాల గురించి ఆ పోస్ట్​లో ఏం లేదు. ఆ వివరాల కోసం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఓ సాధారణ ఫ్యామిలీ మ్యాన్​గా ఉంటూనే.. క్రైమ్​ను ఛేజ్​ చేసే వ్యక్తిగా మనోజ్​ బాజ్​పేయి నటన అందరిని ఆకట్టుకుంది. స్టోరీ హైలైట్​గా ఉండటం వల్ల రెండు సీజన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా రెండో సీజన్​లో నటించిన ప్రముఖ నటి సమంతకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. వాస్తవానికి.. సీజన్​ 2 ముగింపులోనే సీజన్​​ 3 సంకేతాలిచ్చింది వెబ్​ సిరీస్​ బృందం. తొలి సీజన్​ ఉగ్రవాదం ఆధారంగా, రెండో సీజన్​ శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల కథల ఆధారంగా తెరకెక్కాయి. ఇక మూడో సీజన్.. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్​ ఆధారంగా ఉండనుందని తెలుస్తోంది.

Bhale Thandanana Release Date: టాలీవుడ్ న్యూ యంగ్​ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా సినిమా 'భళా తందనాన'. దర్శకుడు చైతన్య తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్​ ఇటీవలే వాయిదా పడింది. అయితే మేకర్స్​ మళ్లీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మే 6న రిలీజ్ చేస్తున్నామని ఓ పోస్టర్​తో అనౌన్స్ చేశారు. శ్రీ విష్ణు కాస్త కాన్సెప్ట్​తో సినిమాలు ట్రై చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించగా కేథరిన్​ హీరోయిన్​గా నటించారు.

భళా తందనాన
భళా తందనాన

ఇవీ చదవండి: Samantha: మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా: సమంత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.