ETV Bharat / entertainment

తనికెళ్ల భరణి ఎన్నాళ్లకు.. మణిరత్నం ప్రతిష్టాత్మక సినిమాకు మాటలు.. - tanikella Bharani wrote ponniyin selvan dialogues

తనికెళ్ల భరణి.. ప్రొఫెషనల్​ రైటర్​గా సినిమాకు సంభాషణలు రాసి చాలా కాలమైంది. శివ, లేడీస్​ టైలర్​ లాంటి ట్రెండ్​ సెట్టర్​ మూవీస్​కు మాటలు రాసిన భరణి.. ఇప్పుడు మణిరత్నం సినిమా కోసం మరోసారి కలం పట్టారు.

DOC Title * tanikella bharani wrote  dialogues for ponniyin selvan
తనికెళ్ల భరణి ఎన్నాళ్లకు.. మణిరత్నం ప్రతిష్టాత్మక సినిమాకు మాటలు..
author img

By

Published : Jul 9, 2022, 8:00 PM IST

Updated : Jul 9, 2022, 10:59 PM IST

రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు సీనియర్‌ నటుడు తనికెళ్ల భరణి. తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌ సెట్టర్‌ 'శివ'కు ఆయనే సంభాషణలు అందించారు. దర్శకుడు వంశీ-తనికెళ్ల భరణి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. వంశీ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు సంభాషణలను తనికెళ్ల భరణి రాశారు. అయితే తనికెళ్ల భరణి.. మణిరత్నం సినిమా కోసం మరోసారి కలం పట్టారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌ – 1'లో సంభాషణలు తనికెళ్ల భరణినే రాశారు.

'పొన్నియిన్‌ సెల్వన్‌ – 1' కోసం తనికెళ్ల భరణి పనిచేసిన విషయం చాలా మందికి తెలియదు. శుక్రవారం విడుదలైన టీజర్​ చూశాకే ఈ విషయం తెలిసింది. ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్​ సెట్టర్​ సినిమాలకు సంభాషణలు రాసిన.. తనికెళ్ల భరణి చాలా రోజలు తర్వాత.. ప్రొఫెషనల్​ రైటర్​గా మారారు. ఆయన ఆఖరిసారిగా 2000లో వచ్చిన 'హ్యాండ్సప్‌' సినిమాకు రాశారు. ఆయన రాసి, దర్శకత్వం వహించిన సినిమా మాత్రం 'మిథునం'. ఇది 2011లో వచ్చింది. అంటే దాదాపు ఆయన సంభాషణలు రాసి దాదాపు 22ఏళ్లు అవుతుండగా.. దర్శకరచయితగా ఒక సినిమా వచ్చి 11 ఏళ్లు పూర్తయింది.

ఇదీ చదవండి: నయనతార- విఘ్నేశ్‌ పెళ్లి ఫొటోలు.. రజనీకాంత్, షారుక్​​ సందడి

Last Updated : Jul 9, 2022, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.