ETV Bharat / entertainment

ముఖంపై తీవ్ర గాయాలతో నటి.. అసలేం జరిగిందో తెలుసా? - Actress Anika Vijay Vikraman Latest Insta Post

ఓ నటిపై దాడి జరిగింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఆ నటి సోషల్​ మీడియా వేదికగా ఫొటోలను పంచుకున్నారు. దీంతో అభిమానులు స్పందిస్తూ.. నటికి ధైర్యం చెబుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..

Tamil actress Anicka Vijayi Vikramman Attack
అనిఖా విక్రమన్ బాయ్​ఫ్రెండ్​పై తాజా పోస్ట్
author img

By

Published : Mar 7, 2023, 7:06 AM IST

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా... వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. సాధారణ మహిళల దగ్గర నుంచి ఫిల్మ్​ స్టార్స్​ వరకు ఈ దాడులను ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఓ తమిళ నటి అనిఖా విక్రమన్​పై ఆమె ప్రియుడు దాడి చేశాడు. ఈ మేరకు ఆ నటి సోషల్​ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. తన బాయ్​ఫ్రెండ్ చిత్రహింసలకు గురి చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫొటోల్లో అనిఖా శరీరంపై కమిలిన గాయాలు, ముఖం, కళ్లు కందిపోయి కనిపించాయి. ఇక తన బాయ్​ఫ్రెండ్​ వల్ల తనకు ప్రాణహాని ఉందని.. అలాగే తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని అనిఖా తెలిపారు. దీంతో అభిమానులు ఆమెకు సానుభూతి తెలుపుతున్నారు.

"గతంలో అనూప్‌ పిల్లై అనే వ్యక్తితో రిలేషన్‌షిప్​లో ఉన్నాను. అది నాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అతడు నన్ను శారీరకంగా వాడుకొని మానసికంగా తీవ్ర మనోవేదనకు గురి చేశాడు. అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ఇన్ని ఇబ్బందులకు గురి చేసినా అతడిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఇలాగే వేధిస్తే క్షమాపణలు అడిగాడు అని వదిలేశా. ఇప్పుడు మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఒళ్లంతా కమిలేలా కొట్టాడు. భరించలేక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. మొదట మేమిద్దరమూ ఫ్రెండ్స్‌గా ఉన్నామని.. రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు తరచుగా అతడు నా ఫోన్‌ను చెక్‌ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టి తన ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడానికి వెళ్లాడు. నేను ఆ దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే యాక్టింగ్​ బాగా చేస్తున్నావంటూ హేళన చేస్తూ వెకిలిగా నవ్వాడు" అంటూ అనిఖా ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో సోషల్​ మీడియాలో నెటిజన్లు కూడా తీవ్రంగా రియాక్ట్​ అయ్యారు. నిందితుడిపై మండిపడుతున్నారు. "ఈ విషయంలో మీకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. మీపై దాడి చేసిన వ్యక్తి ఫొటోలను కూడా షేర్​ చేయండి. సైబర్​ క్రై పోలీసులను కూడా ఆశ్రయించండి. దీని నుంచి తేరుకోవడానికి మీకు, మీ కుటుంబ సభ్యులకు బలం కలగాలని కోరుకుంటున్నాను" అని ఓ నెటిజన్​ రాసుకొచ్చాడు.
కాగా, అనిఖా విక్రమన్​ 'ఎంగ పాటన్ సొత్తు' అనే తమిళ్​ సినిమాతో తెరంగేట్రం చేసింది. అనంతరం 'విషమకరణ్', 'ఐకేకే' అనే సినిమాలు చేసింది. ఇక తెలుగులో అఖిల్​ సార్తక్​తో ఓ సినిమా చేసారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.