Ajith Kerala temple: కేరళ పాలక్కడ్లోని పెరువెంబు ఊట్టుకులంగర మందిరానికి అనుకోని అతిథి విచ్చేశారు. ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్.. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం 4.30 గంటలకు గుడికి వెళ్లి.. పూజలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున మందిరానికి తరలివచ్చారు.
Actor Ajith visits temple: నెరసిన గడ్డంతో తనదైన స్టైల్లో కనిపించారు అజిత్. దేవుడికి స్వయంగా పూజలు చేశారు. మందిర అధికారులు, సిబ్బంది, అభిమానులతో ఫొటోలు దిగారు. సాయంత్రం వరకు ఆలయంలోనే గడిపారు. 5 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. ఆలయానికి నటుడు విచ్చేశారన్న విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొన్న చుట్టుపక్కల ప్రజలు.. ఆయన వెళ్లిన తర్వాతా పెద్ద ఎత్తున గుడికి చేరుకున్నారు. అజిత్ వెళ్లిపోయారని తెలుసుకొని.. నిరాశగా వెనుదిరిగారు.
2015లోనూ అజిత్.. ఈ ఆలయాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. అప్పట్లో తన కుటుంబ సభ్యులతో ఇక్కడికి విచ్చేశారని చెప్పారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు రావడం వల్ల.. దర్శనాన్ని మధ్యలోనే ఆపేసి వెనక్కి వెళ్లారని వివరించారు. అజిత్ తండ్రి స్వస్థలం పాలక్కడ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో తన మనసుకు ఎంతో దగ్గరగా అనిపించే ఈ ప్రదేశాన్ని, ఇక్కడి ఆలయాన్ని తరచూ సందర్శిస్తుంటారు అజిత్.
ఇదీ చదవండి: సామ్- నయన్ సందడి.. కృతి సనన్ చెల్లితో రవితేజ రొమాన్స్!