ETV Bharat / entertainment

ఆసక్తిగా 'ఆ అమ్మాయి..' ట్రైలర్‌.. లేడీ బౌన్సర్‌గా తమన్నా - తమన్నా కొత్త సినిమా

Babli Bouncer Trailer : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్‌' ట్రైలర్‌ విడుదల అయ్యింది. సుధీర్‌ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు మహేశ్‌బాబు ట్రైలర్‌ని విడుదల చేశారు.

babli bouncer trailer
babli bouncer trailer
author img

By

Published : Sep 5, 2022, 8:08 PM IST

Babli Bouncer Trailer : ఒక అబ్బాయి జీవితాన్ని ఓ అమ్మాయి ఎలా ప్రభావితం చేసింది? అనూహ్యంగా వారెలా ప్రేమలో పడ్డారు? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. సుధీర్‌ బాబు, కృతిశెట్టి నాయకానాయికలు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు మహేశ్‌బాబు ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ని మెచ్చిన మహేశ్‌ చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. 'నేను యాక్ట్‌ చేస్తా' అని కథానాయిక చెప్పగానే కథానాయకుడు ఆనందంలో మునిగిపోయే సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమై, ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో కృతి శెట్టి.. డాక్టర్‌గా, సుధీర్‌.. ఫిల్మ్‌ మేకర్‌గా కనిపించనున్నారు. హీరోయిన్‌ తల్లి సినీ రంగాన్ని అసహ్యించుకునే వ్యక్తి కావటంతో నాయకానాయికల మధ్య దూరం పెరుగుతుందని, కథానాయకుడు ఓ ప్రమాదానికి గురవుతాడనే హింట్‌ ఇచ్చాయి ట్రైలర్‌లోని సన్నివేశాలు, సంభాషణలు. మరి, వేర్వేరు నేపథ్యాలున్న ఈ ఇద్దరు ప్రేమికులు ఒక్కటయ్యారా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

లేడీ బౌన్సర్‌గా తమన్నా: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్‌'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాలో తమన్నా లేడీ బౌన్సర్‌గా కనిపించనున్నారు. మధుర్ భండార్కర్ దర్శకుడు. త్వరలో ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

"ఫతేపూర్‌ బేరి.. ఈ ఊరు బౌన్సర్లకు కేరాఫ్‌ అడ్రస్‌. ఈ ఊరులో ఏ పిల్లాడైన పెద్దాయ్యాక జీవితంలో సెటిల్‌ కావాలంటే బాడీ పెంచాల్సిందే. అది కూడా ఒక పహిల్వాన్‌ లాంటి బాడీ. ఈ కథ కూడా అలాంటి పహిల్వాన్‌ గురించే కానీ పహిల్వాన్‌ అబ్బాయి కాదు చాకు లాంటి అమ్మాయి" అనే సంభాషణలతో ప్రారంభమైన ట్రైలర్‌లోని సన్నివేశాలు అంతటా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో తమన్నా పదో తరగతి కూడా పాస్‌ కాని ఓ గ్రామీణ యువతిగా కనిపించనున్నారు. తన కాళ్లపై తాను నిలబడటం కోసం లేడీ బౌన్సర్‌గా మారిన ఆమె జీవితంలో ఏ స్థాయికి వెళ్లారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనే ఆసక్తికర అంశాలతో ఈసినిమా రూపుదిద్దుకుంది. "మా నాన్నకు మాటివ్వకుండా ఉంటే ఈపాటికి మీ ఎముకలు విరిగి ఉండేవి. ఇదే మాటను మీ కాళ్లు విరగొట్టి చెప్పగలను. కానీ చేతులు జోడించి అడుగుతున్నా ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్లండి" అంటూ ఆమె చెప్పే డైలాగ్‌లు, ఫైట్‌ సీన్స్‌ మెప్పించేలా ఉన్నాయి. సెప్టెంబర్‌ 23న ఈ సినిమా విడుదల కానుంది.

ఇవీ చదవండి: అమలకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగ్​.. ఏంటంటే?

ఫైమాకు బిగ్​బాస్​లో వారానికి అంత రెమ్యునరేషన్​ ఇస్తున్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.