ETV Bharat / entertainment

'బ్రేకప్​ చెప్పాలని అనుకోలేదు - పెళ్లి విషయంలో నా అభిప్రాయం వేరు' - undefined

Taapsee Pannu Boyfriend : బాలీవుడ్ బ్యూటీ తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్​షిప్​ గురించి మాట్లాడింది. అతడి గురించి తొలి సారి స్పందించింది. ఆ విశేషాలు మీ కోసం

Taapsee Pannu Boyfriend
Taapsee Pannu Boyfriend
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 12:31 PM IST

Taapsee Pannu Boyfriend : 'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది పంజాబీ బ్యూటీ తాప్సీ. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం బీటౌన్​లో వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్వూలో తన రిలేషన్​షిప్​ గురించి రివీల్ చేసింది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్​ మాథిస్‌ బోతో ఆమె ప్రేమలో ఉన్నట్లు గతంలో అనేక వార్తలొచ్చాయి. అయితే వాటిపై తాప్సీ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఈ విషయంపై తొలిసారి పెదవి విప్పింది. మాథిస్​తో రిలేషన్​లో ఉన్నట్లు తెలిపింది.

"బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే నాకు అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్లలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి నేను తనతోనే ఉన్నాను. అతనితో బ్రేకప్‌ చెప్పి మరో బంధంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన నాకు ఏ రోజూ రాలేదు. తన వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా లవ్ స్టోరీ గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.' అంటూ సీక్రెట్ రివీల్​ చేసింది.

Taapsee Pannu Movies : ఇక తాప్సీ కెరీర్​ విషయానికి వస్తే పలు తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు ఆ తర్వాత కోలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బిజీ అయిపోయింది. అలా కొద్ది కాలం పాటు టాలీవుడ్, కోలీవుడ్​లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్​కు షిఫ్ట్​ అయిపోయింది. ప్రస్తుతం అక్కడ పలు కీలక పాత్రలు చేస్తూ సక్సెస్​ఫుల్ హీరోయిన్​గా దూసుకెళ్తోంది. 'పింక్​', 'తప్పడ్​', 'రష్మీ రాకెట్​', 'లూప్​ లపేటా', 'హసీన్ దిల్​రుబా', 'అన్నాబెల్లె సేతుపతి', 'మిషన్ ఇంపాజిబుల్' లాంటి సినిమాల్లో మెరిసినప్పటికీ.. కొన్నింటికి మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు అందుకోలేదు. అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలా ఓ వైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు స్టార్‌ హీరోల సరసన నటిస్తూ సందడి చేస్తోంది. అలా తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్‌ బాద్​షా షారుక్‌ ఖాన్​ సరసన 'డంకీ' సినిమాలో మెరిసింది.

స్కూల్​ సీనియర్​తో ప్రేమలో పడ్డ తాప్సి- చదువు డిస్టర్బ్​ అవుతుందని బ్రేకప్​!

'షారుక్​కు నేనంటే ఎంతో నమ్మకం- అందుకే ఆ విషయాలు నాతో షేర్ చేసుకున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.