ETV Bharat / entertainment

ఆమె వద్దంటే ఆ సినిమా నుంచి SVR​నే తీసేశారట..!

ఒకానొక సమయంలో అగ్ర నటుడు ఎస్వీ రంగారావునే ఆ హీరోయిన్​ కోసం నిర్మాత నాగిరెడ్డి సినిమాలోంచి ఓ తీసేశారట. ఎందుకంటే..

sv rangarao was cast out from a film due to actress vijaya nirmala
vijaya nirmala with sv ranga rao
author img

By

Published : Nov 1, 2022, 6:12 PM IST

విజయనిర్మల కోసం ఎస్వీ రంగారావునే సినిమాలోంచి తీసేసిన సంఘటనను ఊహించగలమా. కానీ, అప్పట్లో జరిగింది. తెలుగులో విజయం సాధించిన 'షావుకారు' చిత్రాన్ని తమిళంలో 'ఎంగవీటి పెన్‌'గా తీశారు. ఇందులో ఎస్వీఆర్‌ కోడలి పాత్ర విజయనిర్మలకు దక్కింది. విజయ నిర్మలను చూసి 'ఈ అమ్మాయి ఏంటి ఇంత సన్నగా ఉంది... వద్దు మార్చండి' అన్నారట ఎస్వీఆర్‌. 'ఇంత మంచి సంస్థలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది' అనుకుంటూ ఏడుస్తూ తన గదికి వెళ్లిపోయారట విజయ నిర్మల. అంతే కాకుండా ఇక తనను షూటింగ్‌కు పిలవరు అని అనుకున్నారట.

కానీ మరుసటి రోజు ఆమె కోసం చిత్ర నిర్మాత నాగిరెడ్డి కారు పంపించారట. తీరా సెట్‌కి వెళ్లి చూస్తే రంగారావు స్థానంలో ఎస్వీ సుబ్బయ్యగారు ఉన్నారట. "ఈ అమ్మాయి ఇంత బాగుంటే ఈయన వద్దంటున్నాడు ఏమిటి.. ఆయన్నే మారిస్తే పోతుంది" అని నాగిరెడ్డి అనుకొని ఉంటారు. అప్పట్లో నిర్మాతలకు సినిమాపైనా, నటీ నటుల ప్రతిభ పైనా అంత పట్టు ఉండేది" అని ఓ సందర్భంలో విజయ నిర్మల ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఓ వేడుకలో ఎస్వీ రంగారావు, విజయనిర్మల కలుసుకున్నప్పుడు 'చూడండి నన్ను వద్దన్నారు...ఎప్పటికైనా మీతో నటిస్తా' అన్నారట విజయ నిర్మల. అన్నట్టుగానే ఎస్వీఆర్‌తో కలసి 'మామకు తగ్గ కోడలు' అనే సినిమాలో ఆమె నటించారు.

ఇదీ చదవండి: అల్లుఅర్జున్​ సీక్రెట్స్​ను అతడికే చెప్తారట.. భార్యకు కూడా నో

దిల్​రాజు 'వారసుడు'ను పరిచయం చేసిన దళపతి విజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.