ETV Bharat / entertainment

లలిత్ మోదీతో సుస్మిత సేన్ బ్రేకప్ - లలిత్​ మోదీ సుస్మితా సేన్​ బ్రేకప్​

Lalitmodi sushmitha sen breakup రిలేషన్​షిప్​లో ఉన్న లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ ప్రేమాయణం మూన్నాళ్ల ముచ్చటైంది. వీరిద్దరూ విడిపోయారని తెలుస్తోంది.

Lalitmodi sushmitha sen breakup
లలిత్ మోదీతో సుస్మిత సేన్ బ్రేకప్
author img

By

Published : Sep 6, 2022, 12:26 PM IST

Lalitmodi sushmitha sen breakup: తామిద్దరం ప్రేమలో ఉన్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెబుతూ ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ కొంతకాలం కిందట ప్రకటించి అందరికీ షాకిచ్చారు. సుస్మితతో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలను లలిత్ ఈ ఏడాది జులైలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుస్మితతో డేటింగ్ చేస్తున్నానని, త్వరలోనే వివాహ బంధంలోకి కూడా వస్తామని ట్వీట్​ చేశారు.

అయితే, వయసులో చాలా తేడా ఉన్న ఈ ఇద్దరూ ప్రేమలో పడటంపై అప్పట్లో అంతా ఆశ్చర్యపోయారు. అయితే, ఈ ఇద్దరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చటే అయిందట. తాజాగా ఈ ఇద్దరూ విడిపోయారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల, లలిత్ మోదీ తన ఇన్ స్టాగ్రామ్​లో డిస్ ప్లే పిక్చర్, బయోలో సుస్మిత ఫొటో, ఆమె ప్రస్తావనను తీసేయడంతో వీళ్లు బ్రేకప్ అయ్యారన్న పుకార్లకు బలం చేకూరుతోంది.

లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని, బయోని మార్చేశారు. అందులో సుస్మిత ప్రస్తావన లేదు. ఆయన కొత్త బయోలో 'ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. మూన్' అని మాత్రమే ఉంది. ఇన్​స్టా డీపీలో కూడా తన సోలో పిక్చర్‌ మాత్రమే పెట్టారు. సుస్మితతో విడిపోవడం వల్లే తన డీపీ, బయోల నుంచి ఆమె ఫొటో, పేరు తొలగించారన్న వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే వీరిద్దరూ స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి: పైరసీ వెబ్‌సైట్లకు షాక్​.. ఇక బంద్​ చేయాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.