ETV Bharat / entertainment

Surender Reddy Upcoming Movies : సురేందర్ రెడ్డి లైనప్​ ఛేంజ్​.. ముందు పవన్​తో కాదట ఆ స్టార్​ హీరోతో​! - సురేందర్ రెడ్డి లేటెస్ట్ న్యూస్

Surender Reddy Upcoming Movies : సురేందర్ రెడ్డి లైనప్​ ఛేంజ్ అయినట్లు తెలిసింది. పవన్​ కల్యాణ్​ కన్నా ముందు ఆ స్టార్​ హీరోతో సినిమా చేయబోతున్నారట.

Surender Reddy Upcoming Movies : సురేందర్ రెడ్డి లైనప్​ ఛేంజ్​.. ముందు పవన్​తో కాదట మరో స్టార్​ హీరోతో ఫిక్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 9:40 PM IST

Surender Reddy Upcoming Movies : ఏజెంట్ చిత్రంతో కెరీర్​లో భారీ డిజాస్టర్​ అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి.. ఆ తర్వాత పవర్ స్టార్​ పవన్ కళ్యాణ్​తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా కోసం పూజ కార్యక్రమాలతో ఓ ఆఫీస్ కూడా ఓపెనింగ్ చేశారు. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డి యూటర్న్​ తీసుకున్నట్లు తెలిసింది. ఆయన లైనప్ మారిందట. పవన్ కళ్యాణ్​తో సినిమా కన్నా ముందు మరో స్టార్​ హీరోతో మూవీ చేసేందుకు రెడీ అయనట్లు సమాచారం అందింది.

ఇంతకీ ఆ హీరో ఎవరంటే?... పవన్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్​తో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. ఆయన పూర్తి చేయాల్సిన చిత్రాల జాబితా కూడా పెద్దగా ఉంది. ఉస్తాద్​ భగత్ సింగ్​, హరి హర వీరమల్లు, ఓజీ... ఇలా వరుసగా ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల తర్వాతే పూర్తి కానున్నట్లు తెలిసింది. అందుకే ఇప్పుడు సురేందర్ తన​ లైనప్​ను మార్చుకున్నారట. విక్టరీ వెంకటేశ్​తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. పవన్ తన సినిమాలన్నీ పూర్తి చేసేలోగా... సురేందర్​ వెంకీతో సినిమా కంప్లీట్​ చేస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్​ వర్క్​ జరుగుతున్నాయట. వెంకటేశ్​ మార్క్.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్​గా సినిమాను తీర్చిదిద్దనున్నారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. భూపతిరాజా ఈ చిత్రానికి కథ అందించనున్నారట.

ఇకపోతే వెంకటేశ్ కూడా గత కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ ముందుకెళ్తున్నారు. 'నారప్ప', 'దృశ్యం 2', 'ఎఫ్ 3' చిత్రాల విజయాలతో ఆయన జోరు మీదున్నారు. త్వరలోనే 'సైంధవ్' చిత్రంతో ఆడియెన్స్​ ముందుకు రానున్నారు. దీని తర్వాత ఆయన ఇప్పుడు సురేందర్​తో కలిసి పని చేసేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుందట.

ఎలాగో సురేందర్ రెడ్డి మేకింగ్ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో తెలిసిన విషయమే. యాక్షన్ సీన్స్​ను తనదైన స్టైల్​ మార్క్​తో చిత్రీకరిస్తుంటారు. అయితే ఆయన తీసిన గత రెండు సినిమాలు 'సైరా', 'ఏజెంట్' అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు ఆయన వెంకటేశ్​తో చేయబోయే సినిమా ఎంతో కీలకంగా మారనుంది.

Shreya Dhanwanthary Latest Pics : ఈ తెలుగమ్మాయికి హిందీలో మస్త్ క్రేజ్​.. గ్లామర్ షోతో కుర్రకారు క్లీన్ స్వీప్!

Niharika Latest Pics : సూపర్​ హాట్​గా మెగా డాటర్​ లేటెస్ట్​ ఫొటోషూట్​​​.. ఆ అందాలన్నీ చూపిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.