సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆరోగ్యం విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ మేరకు వైద్యులు ప్రెస్ మీట్ చెప్పి ఈ వివరాలు తెలిపారు.
"రాత్రి సుమారు 2 గంటల సమయంలో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశాం. 20 నిమిషాల సీపీఆర్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటకొచ్చారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్నాం. రేపు మధ్యాహ్నం మరోసారి మీడియాకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం. మరో 48 గంటల వరకు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేం" అని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: క్రిటికల్‌గా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స