ETV Bharat / entertainment

కృష్ణ చనిపోవడానికి అసలు కారణం ఇదే.. స్పష్టతనిచ్చిన వైద్యులు - సూపర్​ స్టార్ కృష్ణ హెల్త్ అప్డేట్స్​

దిగ్గజ నటుడు కృష్ణ చనిపోవడానికి గల కారణాలను తెలిపారు కాంటినెంటల్‌ ఆస్పత్రి ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి. ఏం చెప్పారంటే?

superstar krishna died reasons
కృష్ణ చనిపోవడానికి అసలు కారణం ఇదే
author img

By

Published : Nov 15, 2022, 9:17 AM IST

దిగ్గజ నటుడు కృష్ణ గుండెపోటు, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల చనిపోయినట్లు కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంటినెంటల్‌ ఆస్పత్రి ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..

"కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్‌ చేశాం. ఆ తర్వాత చికిత్స చేయడం ప్రారంభించాం. వచ్చినప్పటి నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్‌ అవసరం ఏర్పడంతో అది కూడా చేశాం. కృష్ణకు అందిస్తున్న వైద్యం గురించి ఎప్పటికప్పుడు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశాం. సోమవారం సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింత విషమించింది. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొద్ది గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచారు. కృష్ణ విషయంలో వైద్యనీతిని పాటించాం. ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాం. కృష్ణ గొప్పమనిషి. కృష్ణ భౌతికకాయాన్ని వాళ్ల కుటుంబానికి అప్పగించాం. మిగిలిన విషయాలు వాళ్లు వెల్లడిస్తామని చెప్పారు." అని డాక్టర్‌ గురు తెలిపారు.

ఇదీ చూడండి: కృష్ణ మరణం మాటలకు అందని విషాదం: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.