ETV Bharat / entertainment

రణ్‌బీర్‌ అలా చేస్తాడని తెలిసి షాకయ్యా: రాజమౌళి

SS Rajamouli Ranbir Kapoor: బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​, ఆలియా భట్​ జంటగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా వైజాగ్​లో పర్యటించింది చిత్రబృందం. ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్న రాజమౌళి కూడా వారితో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా రణ్​బీర్​ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు జక్కన్న. అదేంటంటే..

brahmastra ss rajamouli
ranbir kapoor
author img

By

Published : May 31, 2022, 5:55 PM IST

SS Rajamouli Ranbir Kapoor: సినిమాలను అంగీకరించేందుకు బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ అనుసరించే విధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ముఖకవళికలతోనే మెప్పించగలిగే నటుల్లో రణ్‌బీర్‌ ఒకరిని కొనియాడారు. 'బ్రహ్మాస్త్ర' ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. రణ్‌బీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, అలియాభట్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాకి రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిభాగం సెప్టెంబరు 9న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు దర్శకుడు అయాన్‌, రణ్‌బీర్‌, రాజమౌళి విశాఖపట్నం విచ్చేశారు. మెలొడీ థియేటర్‌ వేదికగా ఏర్పాటు చేసిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ ది టీమ్‌ బ్రహ్మాస్త్ర' వేడుకకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Brahmastra
రాజమౌళి

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "తానో పెద్ద ప్రాజెక్టును నిర్మించబోతున్నానని, ఓసారి కథ వినమని, నచ్చితే సమర్పకులుగా వ్యవహరించాలని కరణ్‌ జోహార్‌ నన్ను కోరారు. ఒకే అన్నాను. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ కలిసి 'బ్రహ్మాస్త్ర' కథ చెప్పారు. ఆయన స్క్రిప్టు వివరించిన తీరు, సినిమాలపై ఆయనకున్న ఆసక్తికి నేను ముగ్ధుడినయ్యా. అప్పటి వరకు తాను రూపొందించిన విజువల్స్‌ ఒక్కొక్కటిగా చూపిస్తుంటే 'చిత్ర పరిశ్రమకు మరో పిచ్చోడు దొరికాడు' (నవ్వుతూ..) అని అనుకున్నా. అలియాను నేను 'యాక్షన్‌ పవర్‌ హౌస్‌' అంటుంటా. చాలా తెలివైన నటి. ఏ పాత్రనైనా వెంటనే ఆకళింపు చేసుకుని దర్శకుడు కోరుకున్నట్టు నటించగలదామె. హావభావాలతో అందరినీ కట్టిపడేసే నటుల్లో రణ్‌బీర్‌ కపూర్‌ ఒకరు. ఇటీవల ఆయన గురించి ఓ విషయం తెలిసి, షాక్‌ అయ్యా. తాను కథ వినకుండా మనిషిని చూసి సినిమాను ఓకే చేస్తాడట" అని రాజమౌళి పేర్కొన్నారు.

Brahmastra
రణ్‌బీర్‌

అతడికి వీరాభిమానిని: "నాపై ఇంత ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా హోమ్‌టౌన్‌లోనూ ఇంతటి ఆదరణను నేను చూడలేదు. మీ అందరికీ కృతజ్ఞతలు. పండగలాంటి ఈ వాతావరణాన్ని చూసి ఇంకా చాలామంది బాలీవుడ్‌ నటులు ఇక్కడి వస్తారు. సౌత్‌ ఇండియన్‌ సినిమాలంటే నాకు బాగా ఇష్టం. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. అందరిని నటనను ఇష్టపడతా. డార్లింగ్‌ ప్రభాస్‌కు వీరాభిమానిని" అని రణ్‌బీర్‌ తెలిపారు.

Brahmastra
ప్రచారంలో 'బ్రహ్మాస్త్ర' టీమ్​

ఆరోజే ట్రైలర్​: "ఈ రోజు నాకెంతో ప్రత్యేకం. నేను గతంలో తెరకెక్కించిన 'యే జవానీ హే దీవానీ' చిత్రం 9 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది. దాని తర్వాత నేను తీసిన సినిమా 'బ్రహ్మాస్త్ర'నే. ఇంతకాలం ఈ ప్రాజెక్టు కోసమే పనిచేశా. భారతీయ సంస్కృతిని గౌరవిస్తా. భారతీయ మూలాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశా" అని అన్నారు దర్శకుడు అయాన్‌ ముఖర్జీ. ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్‌ 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.