Sreeleela Movie Promotions : తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సెన్సేషనల్ నటి శ్రీలీల. వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే ఇలా చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నా.. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు మాత్రం ప్రత్యేక సమయం కేటాయించింది. అయితే హీరోయిన్లు ఒకట్రెండు మూవీ ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొనడమే ఎక్కువంటే.. శ్రీలీల మాత్రం మూడు రోజుల ప్రమోషన్ టూర్లో కూడా ఉత్సాహంగా పాల్గొంది. అయితే ఆ సినిమాపైనే శ్రీలీల స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తోంది? ఎవరి కోసం ఇలా చేస్తోంది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Sreeleela Bhagavanth Kesari Movie : అయితే.. శ్రీలక ప్రత్యేక సమయం కేటాయించిన సినిమా మరేదో కాదు.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి'. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లలో శ్రీలీక ఉత్సాహంగా పాల్గొంది. అంతేకాకుండా మూడు రోజుల ప్రమోషన్ టూర్‌కు కూడా వెళ్ళింది. దీంతో ఈ సినిమాపై శ్రీలీల ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తోంది? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
అయితే శ్రీలీల అలా చేయడానికి కారణాలు ఉన్నాయట. మొదటగా.. భగవంత్ కేసరిలో శ్రీలీల తన మనసుకు చాలా దగ్గరైన పాత్ర చేసిందట. ఆ పాత్ర గ్లామర్‌పై ఆధారపడకుండా.. నటన ప్రాధాన్యంగా సాగిందని.. అది శ్రీలీలకు నచ్చినట్లు సినీ వర్గాల సమాచారం. ఇక మరో కారణం.. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా.. పలు వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ప్రమోషన్లకు అందుబాటులో లేరు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకుని రెండో ఆలోచన లేకుండా సినిమా ప్రమోషన్ బాధ్యత భుజానికెత్తుకుందట శ్రీలీల. అందులో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడితో వరుసగా ప్రమోషన్ ఈవెంట్లకు హాజరైంది. ఈ కారణంగానే వరుస షూటింగ్‌లు, సినిమా రిలీజ్లు ఉన్నా.. భగవంత్ కేసరికి సమయం కేటాయించింది.
Balakrishna Hat Trick Hits : హ్యాట్రిక్ హిట్స్‌తో ట్రెండ్ సెట్ చేసిన బాలకృష్ణ.. ఆ హీరోలే టార్గెట్!