ETV Bharat / entertainment

పూరి మరోసారి మెప్పిస్తే మెగా ప్రాజెక్ట్ షురూ..! - మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ కాంబినేషన్

సినీ అభిమానులను అలరించేందుకు మరో క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. స్టార్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు మెగాస్టార్ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాలు..

megastar chiranjeevi movie with puri jagannadh

author img

By

Published : Feb 9, 2023, 10:57 PM IST

టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబినేషన్​ సిద్ధమవుతోంది. సినీ అభిమానులకు ఫుల్​ కిక్​ అందించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్​ చిరంజీవితో జట్టుకట్టబోతున్నారు స్టార్​ డైరెక్టర్ పూరి జగాన్నాథ్​. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ కాంబినేషన్​ వర్కవుటైతే.. మరో ఇండస్ట్రీ హిట్ పక్కా అని అంటున్నారు ఫ్యాన్స్. కాగా, పూరి జగన్నాథ్​ ప్రాజెక్టుకు చిరంజీవి ఇప్పటికే గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు.. సినిమా దాదాపు ఖరారైనట్లు టాలీవుడ్ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, చిత్ర బృందం నుంచి అఫీషియల్​ స్టేట్​మెంట్ వచ్చేవరకు ఈ విషయంపై స్పష్టత రాదు.

కాగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' సినిమా చేస్తున్నారు. ఆ మూవీ పూర్తైన తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్​లో ఆయన మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే వెంకీ కుడుములతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక, 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో బ్లాక్​బస్టర్​ అందుకున్న పూరి జగన్నాథ్.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ దర్శకత్వంలో చేసిన 'లైగర్' సినిమా చేశారు. అయితే ఈ మాత్రం బాక్సాఫీసు ముందు ఆశించినంతగా రాణించలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ​తో చేయాలనుకున్న 'జనగణమన' అనే చిత్రం కూడా పక్కకు వెళ్లింది. కాగా, ఇప్పుడు మెగాస్టార్​ సినిమాతోనైనా పూరి దారిలో పడతాడో లేదో అనే విషయం.. ఈ మూవీ సెట్స్​పైకి వెళితే క్లారిటీ వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.