ETV Bharat / entertainment

టాలీవుడ్​లో 'రీ రిలీజ్'​ ట్రెండ్.. స్టార్​ హీరోల ఫ్యాన్స్​కు పండగ - అతడు రీ రిలీజ్‌

ఒకప్పుడు సూపర్ హిట్​ అయిన సినిమాలు మళ్లీ వెండితెరపై కనిపిస్తున్నాయి. తమ అభిమాన హీరోల బ్లాక్​ బస్టర్లను చూసేందుకు ఫ్యాన్స్​ థియేటర్లపైకి ఎగబడుతున్నారు. టాలీవుడ్‌లో ఇటీవల ట్రెండ్‌గా మారిన 'రీ రిలీజ్‌' విశేషాలేంటో చూద్దాం..

special-story-on-re-release-trend-in-tollywood

author img

By

Published : Sep 29, 2022, 1:06 PM IST

గతంలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మళ్లీ సందడి చేస్తున్నాయి. 'రీళ్లు'లో సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు '4కే'టెక్నాలజీతో కొత్త అనుభూతి పంచుతున్నాయి. ఈతరం సినీ ప్రియులను నాటి తరంలోకి తీసుకెళ్తున్నాయి. టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారిన 'రీ రిలీజ్‌'విశేషాలేంటో చూద్దాం..

మళ్లీ ఎందుకు?
నాటి హిట్‌ చిత్రాలు సృష్టించిన ప్రభంజనం గురించి విని, ఆ అనుభూతి పొందాలనే నేటి యువత ఆసక్తే ‘రీ రిలీజ్‌’కు కారణంగా నిలుస్తోంది. ఏదైనా సినిమాని టీవీలోనో, ఓటీటీలోనో చూసి "అరే.. ఈ చిత్రం ఇంత బాగుంది. నా బాల్యంలో విడుదలవటంతో నేను దీన్ని థియేటర్లలో చూడలేకపోయా. వెండితెరపై చూస్తే ఆ మజానే వేరు" అనే ఫీలింగ్‌ పాత సినిమాలను మళ్లీ కొత్తగా మార్చేలా చేస్తోంది. ఇదొక టైమ్‌ ట్రావెల్‌లాంటిదని పలువురు సినీ అభిమానులు అభివర్ణిస్తున్నారు. తమ అభిమాన హీరో కొత్త సినిమా రావటం ఆలస్యమైనప్పుడూ ఈ రీ రిలీజ్‌ సినిమాలు ఊరటనిస్తున్నాయి. కష్టకాలంలో థియేటర్లను కాపాడేందుకూ ఈ విధానం ఉపయోగపడుతుందనేది ఇంకొందరి అభిప్రాయం. ఇక్కడే కాదు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, కెనడాలోని తెలుగు ప్రేక్షకులు దీన్ని ఆస్వాదిస్తున్నారు.

special-story-on-re-release-trend-in-tollywood
.

ఎలా మొదలైంది?
బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందిన 'మాయా బజార్' లాంటి క్లాసిక్స్‌ రంగులద్దుకొని, ఇప్పటి ప్రేక్షకులనూ మెప్పించిన సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు అధునాతన సాంకేతికత '4కే'తో 'రీళ్ల'లో రూపొందిన చిత్రాలను డిజిటల్‌కి మారుస్తున్నారు. దీనికి 'పోకిరి' నాంది పలికింది. 16 ఏళ్ల క్రితం విడుదలైన ఈ ట్రెండ్‌ సెట్టర్‌ ఫిల్మ్‌ని రీ మాస్టర్‌ చేసి, యూఎస్‌లో రీ రిలీజ్‌ను ప్రకటించగా క్షణాల్లోనే ప్రీ బుకింగ్‌ టికెట్లు అమ్ముడుపోయాయి.

స్పందన బాగుండటంతో ఆ విధానాన్ని ఇండియాలో ప్రారంభించారు. మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆయన పుట్టిన సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 9న రిలీజై, మరోసారి సత్తా చాటింది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'జల్సా' ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ ఏడాది సెప్టెంబరు 1న రీ రిలీజ్‌ చేశారు. 20 ఏళ్ల కిత్రం హిట్‌ అందుకున్న బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సైతం ఇటీవల మళ్లీ విడుదలై, పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ప్రభాస్‌ 'బిల్లా', చిరంజీవి 'ఇంద్ర', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', మహేశ్‌బాబు 'అతడు', 'ఖలేజా', ఎన్టీఆర్‌ 'ఆది' తదితర చిత్రాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కృష్ణ హీరోగా రూపొంది, కనీవినీ ఎరగని విజయం సాధించిన 'అల్లూరి సీతారామరాజు'(1974)), 'సింహాసనం'(1986) చిత్రాలనూ మరోసారి తెరపైకి తీసుకురానున్నారని తెలుస్తోంది. వీటికి లభించే ప్రేక్షకాదరణను బట్టి మరిన్ని సినిమాలను రీ రిలీజ్‌ చేయనున్నారు.

వసూళ్ల మాటేంటి?
అభిమానుల ఆనందం కోసం పాత సినిమాలకు మెరుగులుదిద్ది తీసుకొస్తున్నారు. బాగుంది.. మరి వసూళ్ల సంగతేంటి? అనేది చాలామంది సందేహం. రీమాస్టరింగ్‌ చేసేందుకు ఒక్కో సినిమాకు సుమారు రూ. 8 లక్షలు ఖర్చవుతుందట. ఆ మూవీ రిలీజై కోట్ల రూపాయాలు వసూలు చేస్తుంది.

ఒక్క రోజులో 320 ‘షో’ల్లో ప్రదర్శితమైన 'పోకిరి' సుమారు రూ.1.75 కోట్లు, 500పైగా షోల్లో (రెండు రోజుల్లో) ప్రదర్శితమైన 'జల్సా' రూ. 3.25 కోట్ల కలెక్షన్లు రాబట్టాయని సినీ వర్గాల సమాచారం. ఈ మొత్తాన్ని ఆయా హీరోల అభిమాన సంఘాలు ఛారిటీలకు అందించి, సేవా హృదయాన్ని చాటుతున్నాయి. ఆణిముత్యాల్లాంటి సిసిమాలను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు, థియేటర్‌ యాజమాన్యాలు రీ రిలీజ్‌పై మొగ్గు చూపుతున్నాయి.

రీ మాస్టరింగ్‌ అంటే?
గతంలో సినిమాలను రీళ్ల ద్వారా చిత్రీకరించేవారనే సంగతి తెలిసిందే. వాటిని ప్రస్తుత థియేటర్లలో ప్రదర్శించటం కష్టం. అందుకే ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టు మార్చాలి. ఈ పద్ధతిలో రీల్‌కు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ను స్కాన్‌ చేసి 4k విజువల్స్‌లోకి తీసుకొస్తారు. ఆడియో క్వాలిటీనీ పెంచుతారు. కొన్ని సినిమాల రీళ్లు అరిగిపోయి, చిగిరిపోవటంతో ఒరిజినల్‌ ఫార్మాట్‌లో చూసినా స్పష్టంగా కనిపించవు. తెరకు అటూఇటూ, కిందా పైనా రకరకాల రంగులు డిస్‌ప్లే అవుతుంటాయి. అలాంటి వాటిని అద్భుతంగా మలచాలంటే 8k టెక్నాలజీని వినియోగించాలి. 4kతో పోలిస్తే దానికి ఖర్చు రెండింతలవుతుంది.

ఎంత సమయం పడుతుంది?

ఆయా సినిమాల రీళ్ల పనితీరుని బట్టి రీ మాస్టరింగ్‌ సమయం రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ఇందులో స్కానింగ్‌, గ్రేడింగ్‌, రీస్టోరేషన్‌.. అనే మూడు పద్ధతులుంటాయి.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16504146_1-2.jpg
.

కాపీ రైట్‌ సమస్య?

ఈ విధానంలోనూ కాపీ రైట్‌ సమస్య ఉంటుంది. అందుకే నిర్మాతల అంగీకారంతో కూడిన పత్రం ఉంటేనే ల్యాబ్స్‌ ఆయా సినిమాలను రీ మాస్టరింగ్‌ చేస్తాయి. ఈ ట్రెండ్‌ ఇలానే కొనసాగాలని అందరి హీరోల అభిమానులు ఆశిస్తున్నారు. మా హీరోది ఫలానా సినిమా రీ రిలీజ్‌ చేయండంటూ సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు. మరి, గతంలో బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌ అందుకున్న ఇంకా ఏయే సినిమాలు భవిష్యత్తులో సందడి చేస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి : ఆరుపదుల వయసులోనూ అదరగొడుతున్న స్టార్​ హీరో.. 25 సినిమాలతో ఫుల్ బిజీ

పవర్​ఫుల్​గా 'గాడ్​ఫాదర్​' ట్రైలర్​​.. చిరు యాక్షన్​ అదరగొట్టేశారుగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.