భారత్‌లోనే కాదు ప్రపంచమంతటా 'ఆర్ఆర్ఆర్' మ్యానియా కొనసాగుతోంది. సినిమా రిలీజైన తొలి రోజు నుంచే థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతే కాకుండా చిత్ర యూనిట్‌కు అవార్డుల పంట పండిస్తోంది. విడుదలై ఏడాదియినప్పటికీ తగ్గేదేలే అంటూ విశ్వవేదికలపై చెలరేగిపోతోంది. ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులను తెచ్చిపెట్టడమే కాకుండా ఆస్కార్ బరిలో తెలుగోడి సత్తా చాటేందుకు సిద్ధమయ్యింది.
కాగా, ఈ సినిమాలోని నాటునాటు పాట.. ప్రపంచమంతటా వేరే లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది. చంద్రబోస్ సాహిత్యం, కీరవాణి బాణీలు, కాలభైరవ- రాహుల్ సిప్లిగంజ్‌ల గాత్రం, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ.. వీటిన్నంటిని జోడించగా వచ్చిన నాటు నాటు అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది 'ఆర్ఆర్ఆర్' టీమ్. థియేటర్లో ఈ పాట విన్న అభిమానులు.. స్టెప్పులేశారు. ఫంక్షన్ ఏదైనా సరే.. డీజేలో ఈ పాట తప్పక ఉండాల్సిందే. అయితే ఈ పాటకు తాజాగా ఇండియాకు చెందిన సౌత్ కొరియన్ ఎంబసీ ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేశారు.
కొరియన్ వనితలు పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేయగా.. పురుషులు కూడా ఎన్టీఆర్, చరణ్‌లా డ్రెస్ వేసుకుని నాటు నాటు స్టెప్పులేశారు. ఈ వీడియోను కొరియాలోని ఇండియా ఎంబసీ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో మురిసిపోయారు. వీడియో ఎంతో బాగుందని.. టీమ్ చేసిన కృషి ఇంకా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.
-
Lively and adorable team effort. 👍 https://t.co/K2YqN2obJ2
— Narendra Modi (@narendramodi) February 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lively and adorable team effort. 👍 https://t.co/K2YqN2obJ2
— Narendra Modi (@narendramodi) February 26, 2023Lively and adorable team effort. 👍 https://t.co/K2YqN2obJ2
— Narendra Modi (@narendramodi) February 26, 2023
కాగా, అంతర్జాతీయ వేదికలపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళితో పాటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. గత ఐదు రోజులుగా అమెరికాలో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.