ETV Bharat / entertainment

వీళ్లు సౌత్​ ఇండియన్ ఫిల్మ్​ సూపర్ హీరోస్​! - హనుమాన్ సూపర్ హీరో

South Indian Super Hero Films : తెరపై సూపర్​ హీరోల మాయాజాలం ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు మన దర్శకులు. ఈ నేపథ్యంలో మన సూపర్ హీరోల సినిమాల గురించి తెలుసుకుందాం.

వీళ్లు సౌత్​ ఇండియన్ ఫిల్మ్​ సూపర్ హీరోస్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 10:17 AM IST

South Indian Super Hero Films : సూపర్​ హీరో సినిమా అనగానే మూవీ లవర్స్​కు మొదటగా హాలీవుడ్‌ చిత్రాలే గుర్తొస్తుంటాయి. బ్యాట్‌ మ్యాన్​, సూపర్‌ మ్యాన్​, స్పైడర్​ మ్యాన్​​, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా అంటూ కల్పిత పాత్రలతో ఆ సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ఈ సూపర్ హీరోలకు ఇండియాలో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. అయితే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికొస్తే యాక్షన్, హారర్, కామెడీ, లవ్ - ఇలా ఏ జానర్​లో అయినా సినిమాలు చేస్తారు కానీ సూపర్​ హీరోను అంత ఈజీగా టచ్ చేయరు. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్​, విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో పాటు ఆ సినిమా చిత్రీకరణ కోసం ఏళ్ల పాటు సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇంత చేశాక కూడా సరైన ఔట్​ఫుట్​ వస్తుందా అంటే దానికి గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి! అందుకే ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ సూపర్ హీరోల చిత్రాల వైపు అడుగులు వేయరు.

అయితే ఇండియన్ సూపర్ హీరో అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది 'క్రిష్​'. ఈ సిరీస్​కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. దీని తర్వాత షారుక్ షారుఖ్ ఖాన్ 'రా.వన్'(బాలీవుడ్ - 2011​) వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మరే సూపర్​ హీరోలు కనపడలేదు. అయితే ఇప్పుడా సూపర్​ హీరోల మాయాజాలం ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు మన దర్శకులు. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ప్రస్తుతం ఇద్దరు సూపర్ హీరోలు వచ్చారు. ఆ మధ్యలో 2021లో మలయాళంలో విడుదలైన మిన్నల్ మురళి(Minnal Murali Movie) - సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కి మంచి హిట్ టాక్​ను దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు నుంచి ప్రశాంత్ వర్మ హనుమాన్(Hanuman Movie) విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భవిష్యత్​లోనూ ఈ ఇద్దరు సూపర్ హీరోల నుంచి సినిమాలు రాబోతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ అయితే మొత్తం 12 సూపర్ హీరోలు కథలు ఉన్నాయని వాటిని ఒకదాని తర్వాత ఇంకొకటి తెరకెక్కిస్తానని అన్నారు. ఇంకా ఈ సూపర్ హీరోలు మాత్రమే కాకుండా రీసెంట్​గా వచ్చిన శివ కార్తికేయన్ 'మహావీరుడు' కూడా సూపర్ హీరో మోడ్​లోనే వచ్చి ఆడియెన్స్​ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రియల్ సూపర్ హీరోస్​ : ఇకపోతే మన పురాణాల్లో నిజమైన సూపర్‌ హీరోలు చాలా మందే ఉన్నారు. వాళ్ల కథలు, శక్తుల్ని పక్కాగా తెరపైకి తీసుకొస్తే ఆ మాయాజాలం తెరపై చూడ్డానికి రెండు కళ్లు చాలవని చెబుతున్నారు సినీ పండితులు. కాబట్టి పక్కా ప్రణాళికతో, కంటెంట్​తో, సృజనాత్మకతో సూపర్ హీరో సినిమాలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారంచే అవకాశం ఉంటుంది. చూడాలి మరి భవిష్యత్​లో ఇండియన్​ సినిమా నుంచి ఇంకెంతమంది సూపర్ హీరోలు పుట్టుకొస్తారో.

రూ.100 కోట్లు దాటేసిన 'హనుమాన్' - అక్కడ 'సలార్​', 'బాహుబలి' రికార్డ్స్​ బ్రేక్​

రిపబ్లిక్‌ డే 'డబ్బింగ్‌' చిత్రాలదే - ఆ మూడు రోజుల్లో 10 సినిమాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.